ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. మొత్తం 16,207 గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ జరుగుతోంది. ఇందులో విలేజ్ సర్వేయర్ గ్రేడ్-3కి చెందిన 1,255 పోస్టులను భర్తీ చేస్తున్నారు. జనవరి 10న ఈ పోస్టులకు పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. అయితే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి జనవరి 31 చివరితేదీ. కాగా, ఫీజు చెల్లించేందుకు జనవరి 30 ఆఖరు తేదీ. ఎంపికైన అభ్యర్థులకు మొదటి రెండేళ్ల పాటు నెలకు రూ.15,000 జీతం అందనుంది.
జనవరి 11 నుంచి అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అన్లైన్లో దరఖాస్తుకు అవకావం కల్పించారు. ఇదివరకే సర్వీసులో కొనసాగుతున్నవారికి 10శాతం మేర వెయిటేజీ లభిస్తుంది. ఎన్‌సీటీవీ డ్రాట్స్‌మ్యాన్ సర్టిఫికేట్ (సివిల్) లేక ఇంటర్లో సర్వేయింగ్ ఒకేషనల్ కోర్స్ లేక సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్ ఇంజినీరింగ్ డిగ్రీని విద్యార్హతగా నిర్ణయించారు. సర్వేయర్ లైసెన్స్ సర్టిఫికేట్ ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకునే వీలుంది.మార్చి చివర్లో లేక ఏప్రిల్‌లో ఈ పోస్టులకు రాత పరీక్ష నిర్వంచనున్నారు. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో 159 పోస్టులుండగా, అత్యల్పంగా కడప జిల్లాలో 14 పోస్టులను భర్తీ చేయనున్నారు.
Also Read; ఏపీ గ్రామ సచివాలయంలో 16,207 పోస్టులు
దరఖాస్తు ఫీజు రూ.200, పరీక్ష ఫీజు రూ.200 మొత్తం రూ.400 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులతో పాటు ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు అవకాశం కల్పించారు. సొంత జిల్లాలకు కాకుండా వేరే జిల్లాలకు అప్లై చేసుకునే నాన్-లోకల్ అభ్యర్థులు మరో రూ.100 అదనంగా చెల్లించాలి. అభ్యర్థులు 01-07-2O20 నాటికి 18 - 42 సంవత్సరాల మధ్య ఉండాలి. 02.07.1978 - 01.07.2002 మధ్య జన్మించిన వారిని అర్హులుగా భావిస్తారు. కేటగిరీలను బట్ట వయోపరిమితిలో కొందరికి సడలింపు వర్తిస్తుంది.
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
జిల్లాలు - భర్తీ చేసే పోస్టులు
శ్రీకాకుళం - 159
విజయనగరం - 151
విశాఖ - 111
తూర్పు గోదావరి - 36
పశ్చిమ గోదావరి - 155
కృష్ణా - 70
గుంటూరు - 16
ప్రకాశం - 144
నెల్లూరు - 109
చిత్తూరు - 131
అనంతపురం - 19
కర్నూలు - 140
కడప - 14
జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..