Ram Gopal Varma: టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు అయ్యింది. ఈ మేరకు ఆయన గతంలో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ ఆయన సతీమణిపై వివాదస్పద పోస్టులు పెట్టినట్లు తెలుస్తొంది. దీంతో పోలీసులు ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మకు బిగ్ షాక్ ఇచ్చినట్లు సమాచారం.
ఆంధ్ర ప్రదేశ్ లో ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో పోస్ట్ లు, ట్రొలింగ్ లపై సీరియస్ ఉన్నట్లు తెలుస్తొంది.
దీనిలో భాగంగానే ఇటీవల పోలీసులు వ్యక్తిత్వ హననం కలిగించే విధంగా పోస్టులు పెట్టిన వారిని అరెస్టులు చేయిస్తు ట్రోలర్స్ తాట తీస్తున్నారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు.. పలు మార్లు వార్నింగ్ కూడా ఇచ్చారు.
అయితే.. తాజాగా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం.. అధికారుల్ని బెదిరించినట్లు మాట్లాడితే సుమోటోగా కేసులు నమోదు చేస్తామని కూడా స్పష్టం చేశారు. అయితే.. పోలీసులు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై కేసును నమోదు చేసినట్లు తెలుస్తొంది.
ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం పోలీస్ స్టేషన్‌లో ఐటీ చట్టం కింద వర్మపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. వ్యూహం సినిమా సమయంలో టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్, నారా బ్రాహ్మాణిలను కించ పరిచే విధంగా వర్మ పోస్టులు పెట్టినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలోనే.. మద్దిపాడు టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి రామలింగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతంఏపీ సర్కారు మాత్రం సోషల్ మీడియా అసత్య ప్రచారాలు,ఫెక్ పోస్టుల మీద మాత్రం కఠినం గా ఉన్నట్లు తెలుస్తొంది.
ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు.. గతంలో పవన్ కళ్యాణ్, ఆయన సతీమణి, పిల్లలు, వంగల పూడీ అనితను గురించి సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులపై తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఇలాంటివారి మానుకొవాలని కూడా వైసీపీ నేతలకు హెచ్చరికలు కూడా జారీ చేసిన విషయం తెలిసిందే.