తెలంగాణలో మద్యం, బార్లు బంద్

 తెలంగాణలో పురపాలక ఎన్నికల ప్రచారం గడువు ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని హోరాహోరీగా కొనసాగించాయి. ప్రచారం గడువు ముగిసిన తర్వాత ఎలాంటి ప్రచార కార్యక్రమాలు నిర్వహించొద్దని సభలు సమావేశాలకు అనుమతి లేదని ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. సెల్‌ఫోన్లు, ఇంటర్నెట్, ఏ ఇతర సాంకేతిక సాధనాల ద్వారా ప్రచారం నిర్వహించొద్దని సూచించింది.   

Last Updated : Jan 20, 2020, 08:05 PM IST
తెలంగాణలో మద్యం, బార్లు బంద్

హైదరాబాద్‌ : తెలంగాణలో పురపాలక ఎన్నికల ప్రచారం గడువు ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని హోరాహోరీగా కొనసాగించాయి. ప్రచారం గడువు ముగిసిన తర్వాత ఎలాంటి ప్రచార కార్యక్రమాలు నిర్వహించొద్దని సభలు సమావేశాలకు అనుమతి లేదని ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. సెల్‌ఫోన్లు, ఇంటర్నెట్, ఏ ఇతర సాంకేతిక సాధనాల ద్వారా ప్రచారం నిర్వహించొద్దని సూచించింది. 

ఎన్నికలు ముగిసే వరకు మద్యం షాపులు, బార్లు మూసివేయాలని, గ్రూప్ సందేశాలు, వాట్సాప్ మెసేజ్‌లపై కూడా నిషేదం విధించింది. నిబంధనలు ఉల్లంఘించిన వారికి రెండేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధిస్తామని హెచ్చరించింది. బ్యాలెట్ పద్దతిలో జరుగనున్న ఈ ఎన్నికల్లోౌ తెలుపు రంగు బ్యాలెట్ పత్రాలను ఉపయోగిస్తోంది ఈసీ. ఓటర్ స్లిప్‌లను "నా ఓటు" అనే యాప్‌ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చని వెల్లడించింది.

జనవరి 22న పోలింగ్ నిర్వహించనుండగా, 25న ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉంటుంది. రాష్ట్రంలో మొత్తం 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు ఎలక్షన్ జరగనుంది.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News