ఢిల్లీ : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రెండు దశల్లో జరగనున్నాయి. మొదటి దశ సమావేశాలు ఈ నెల 31 నుంచి ప్రారంభమై ఫిబ్రవరి 11 వరకు, రెండోదశ మార్చి 2 నుంచి ఏప్రిల్ 3 వరకు జరగనున్నాయి. ఈమేరకు పార్లమెంటరీ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి సూచించింది.
ఫిబ్రవరి 1న ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెడతారు. సీఏఏ, ఎన్నార్సీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు, ఆర్థిక వ్యవస్థ మందగమనం నేపథ్యంలో జరగనున్న ఈ సమావేశాల పట్ల అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..