Diwali Business: దీపావళి పండుగ అంటేనే బాణాసంచా వెలుగులు. ఈ బాణాసంచాపై హైదరాబాద్ నగర పాలక సంస్థ కీలక ప్రకటన చేసింది. అయితే టపాసులపై నిషేధమా? అనే సందహాలు వ్యక్తమవుతుండగా.. అది కాదని తేలింది. దీపావళి సందర్భంగా ఇష్టారాజ్యంగా పటాకుల దుకాణాలు వెలుస్తుండడంతో వాటిపై జీహెచ్‌ఎంసీ ఓ ప్రకటన విడుదల చేసింది. దుకాణాలు ఎలా పడితే అలా నిర్వహించకూడదని.. అనుమతి పొంది అన్ని జాగ్రత్తలతో దుకాణం ఏర్పాటుచేయాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా దుకాణదారులకు జీహెచ్‌ఎంసీ విడుదల చేసిన ప్రకటన వివరాలు ఇలా ఉన్నాయి. దీపావళి సందర్భంగా వ్యాపారం చేయాలనుకునే వారికి జీహెచ్‌ఎంసీ బంపర్ ఆఫర్ ప్రకటించింది.
జీహెచ్ఎంసీ ఆఫర్
దీపావళి పండుగ వేళ అత్యంత లాభదాయకమైన బాణాసంచా వ్యాపారం చేయాలనుకునే వారికి జీహెచ్‌ఎంసీ కొన్ని సూచనలు చేసింది. వ్యాపారం చేయాలనుకునే వారికి కీలక సూచనలు చేసింది. బాణసంచా విక్రయ దుకాణాలపై జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి గురువారం ఓ ప్రకటన చేశారు. బాణాసంచా విక్రయ దుకాణదారులు తప్పనిసరిగా జీహెచ్ఎంసీ నుంచి తాత్కాలిక ట్రేడ్ లైసెన్స్ (వ్యాపార అనుమతి) తీసుకోవాలని స్పష్టం చేశారు. లైసెన్స్ లేకుండా దుకాణం నిర్వహించుకోవడానికి అనుమతి లేదని పేర్కొన్నారు. అనుమతి లేకుండా నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Also Read: KTR Case: నేను సాదాసీదా వ్యక్తి కాదు.. కొండా సురేఖను శిక్షించాల్సిందే: కోర్టులో కేటీఆర్
అనుమతి ఫీజు
ట్రేడ్ లైసెన్స్ ఫీజు రిటైల్ షాపులకు రూ.11 వేలు, హోల్ సేల్ దుకాణాలకు రూ.66 వేలుగా నిర్ణయించినట్లు జీహెచ్‌ఎంసీ వెల్లడించింది. బాణాసంచా దుకాణాల నిర్వాహకులు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా లైసెన్స్ పొంది నిబంధనల మేరకు దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పటాకుల దుకాణాలు ఏర్పాటు చేసుకునే వారంతా నిర్ణీత ఫీజును చెల్లించి జీహెచ్ఎంసీ నుంచి అనుమతి పొందాలని తెలిపారు. తాత్కాలిక ట్రేడ్ ఐడెంటిఫికేషన్ నంబర్ కోసం సిటిజన్ సర్వీస్ సెంటర్/ జీహెచ్ఎంసీ వెబ్‌సైట్ www.ghmc.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు.
ఫీజు చెల్లింపు ఇలా
డిమాండ్ డ్రాఫ్ట్, డెబిట్/క్రెడిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్ ద్వారా ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించవచ్చు. గుర్తింపు కార్డు కోసం ఆధార్ కార్డు, పాన్ కార్డు కాపీ ఇవ్వాలి.
ఇక్కడ నిషేధం
బాణాసంచా దుకాణాలు ఫుట్‌పాత్‌లు, జనావాసాల మధ్య ఏర్పాటు చేసుకోవడం నిషేధం. కాలనీ, బస్తీలకు దూరంగా బహిరంగ ప్రదేశాలు/ పెద్ద హాల్‌లో నిర్వహించుకోవాలి. అగ్ని ప్రమాదాలు సంభవించకుండా తగిన ఏర్పాట్లు చేసుకోవాలి. అగ్నిమాపక నిరోధక పరికరాలు అందుబాటులో ఉంచాలి.
సూచనలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
Diwali: దీపావళి వేళ లాభాలు కురిపించే బాణాసంచా వ్యాపారం.. జీహెచ్ఎంసీ బంపరాఫర్