Salman Khan: రూ. 5 కోట్లివ్వాలని సల్మాన్‌కు బెదిరింపులు.. కూరగాయల వ్యాపారి అరెస్టు.. మరీ ఇంత ట్విస్టా..?..

Lawrence bishnoi warning: సల్మాన్ బెదిరింపుల ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది.  ముంబై పోలీసులు జార్ఖండ్ లో నిందితుడ్ని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
 

1 /6

సల్మాన్ ఖాన్ ను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నట్లు తెలుస్తొంది. ఇప్పటికే సల్మాన్ కు మూడంచెల సెక్యురిటీనీ ఏర్పాటు చేసినట్లు తెలుస్తొంది. అంతే కాకుండా.. ఇటీవల ఆయన దుబాయ్ నుంచి కొత్తగా బుల్లెట్ ప్రూఫ్ కారును సైతం కొనుగోలు చేశారు.

2 /6

ఎన్సీపీ నేత బాబా సిద్దీఖీ దారుణ హత్య తర్వాత బాలీవుడ్ లోను, పొలిటికల్ గా కూడా లారెన్స్ బిష్ణోయ్ పేరు ఒక్కసారిగా మళ్లీ ట్రెండింగ్ గా మారింది. ఇదిలా ఉండగా.. అక్టోబరు 18 న ముంబై ట్రాఫిక్ పోలీసులకు ఒక మెస్సెజ్ వచ్చింది. అందులో సల్మాన్ కు చంపకుండా ఉండాలంటే.. 5 కోట్లు ఇవ్వాలని కూడా డిమాండ్ చేశాడు.

3 /6

అంతేకాకుండా.. లారెన్స్ బిష్ణోయ్ కు సారీ చెప్పాలని కూడా అందులో చెప్పారు. ఒక వేళ తమ బెదిరింపుల్ని తేలిగ్గా తీసుకుంటే మాత్రం.. బాబా సిద్దీఖీ కన్న ఘోరంగా హత్య చేస్తామని కూడా చెప్పారు. దీంతో ముంబై పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు.

4 /6

ఆ తర్వాత అక్టోబరు 21 న  ముంబై పోలీసులకు మళ్లీ దుండగుల నుంచి మెస్సెజ్ వచ్చింది. పొరపాటున మెస్సెజ్ చేశామని,ఈ విషయాన్ని ఇంటితో వదిలేయాలని పోలీసులకు మెస్సెజ్ వచ్చింది. దీంతో పోలీసులు మాత్రం దీనిపై ట్రాక్ చేశారు. జార్ఖండ్ లో నిందితులను గుర్తించారు.

5 /6

ముంబై క్రైమ్ పోలీసులు ముంబైకి వెళ్లి నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో నిందితుడు మాత్రం పోలీసుల విచారణలో అనేక కీలక అంశాలు వెల్లడించినట్లు తెలుస్తొంది. అతనికి లారెన్స్ గ్రూప్ తో లింక్ లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారంట.

6 /6

బాబా సిద్దీఖీ మరణించిన కొద్ది రోజులకే సల్మాన్ మళ్లీ బిగ్ బాస్ 18 చేయడానికి వచ్చాడు. అది తనకు నచ్చలేదని, అందుకే చంపుతానని, కూరగాయలు విక్రయించే వ్యక్తి ఇలా వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తొంది. పోలీసులు మరింత లోతుగా విచారిస్తున్నట్లు సమాచారం.