Janhvi Kapoor: బ్లాక్ డ్రెస్ లో జాన్వీ కపూర్ పరువాల జాతర.. లేటెస్ట్ పిక్స్ వైరల్..

Jahnvi Kapoor: జాన్వీ కపూర్.. శ్రీదేవి డాటర్ గా  చిత్రసీమలో ప్రవేశించి తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే పడింది. ఇన్నేళ్లు ఏ బాలీవుడ్ సినిమాతో రాని గుర్తింపు ఎన్టీఆర్ తో చేసిన ‘దేవర’తో వచ్చింది. ఈ సినిమాతో హీరోయిన్ కు తక్కువ.. అతిథి పాత్రకు ఎక్కువగా అన్నట్టు ఉంది. ఏది ఏమైనా తాను కోరకున్న బాక్సాఫీస్ సక్సెస్ ను ఈ సినిమాతో అందుకోవడం విశేషం. అందుకే ఇపుడు వరుసగా తెలుగు సినిమాలపైనే ఫోకస్ పెడుతోంది.

1 /7

జాన్వీ కపూర్.. తల్లి శ్రీదేవి బాటలో తెలుగు సినిమాలతో స్టార్ హీరోయిన్ కావాలని తెలుగు చిత్ర సీమను నమ్మకుంది. అందుకు  దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ ‘దేవర’ మూవీతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చి ఆ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోంది. ఈ సినిమా తెలుగు, హిందీ, కన్నడ మూడు భాషల్లో మంచి  సక్సెస్ అందుకోవడం విశేషం. 

2 /7

జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఇండస్ట్రీలో  అడుగుపెట్టి  దాదాపు ఆరేళ్లు పూర్తి కావొచ్చింది.తాజాగా ‘దేవర’ సక్సెస్ అయినా.. ఆ క్రెడిట్ మొత్తం ఎన్టీఆర్ కే దక్కింది. దర్శకుడిగా కొరటాలకు కూడా ఏమి దక్కలేదనే చెప్పాలి.   ఈ సినిమాలో జాన్వీ నటించానన్న సంతృప్తి తప్పితే పెద్దగా ఒరిగిందేమి లేదు.

3 /7

  జాన్వీ కపూర్.. ఎన్టీఆర్ తో చేసిన ‘దేవర’ సక్సెస్ తో ప్యాన్ ఇండియా హీరోయిన్ గా సత్తా చూపెట్టింది. మొత్తంగా ఈ సినిమా విజయంలో మేజర్ పార్ట్ ఎన్టీఆర్ కే పోయినా.. జాన్వీకి  కూడా ఎంతో కొంత పేరు వచ్చింది.

4 /7

‘దేవర పార్ట్ -1’లో జాన్వీ పాత్ర కొద్ది సేపు ఉన్న.. రాబోయే ‘దేవర పార్ట్ -2’తో పాటు రామ్ చరణ్ తో చేస్తోన్న నెక్ట్స్ ప్రాజెక్ట్ తో తెలుగులో జెండా పాతాలనే కృత నిశ్చయంతో ఉంది.

5 /7

  జాన్వీ కపూర్. ఫస్ట్ సినిమా 'ధడక్‌'. ఈ సినిమాలో మరాఠిలో హిట్టైన ‘సైరత్’ మూవీకి రీమేక్ గా తెరకెక్కింది.  ఆ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి సక్సెస్ అందుకుంది.  కానీ ఆ త‌ర్వాత జాన్వీ యాక్ట్ చేసిన  సినిమాలు ఎక్కువ మటుకు  ఓటీటీ వేదిక‌గానే విడుదలయ్యాయి.

6 /7

శ్రీదేవి కూతురుగానే జాన్వీ కపూర్ కు  వరుస ఛాన్సులు వస్తున్నాయి. హిందీలో సరైన బ్రేక్ రాకపోవడంతో వరుసగా తెలుగులో సినిమాలు చేస్తోంది. అది కూడా బడా స్టార్ హీరోల సినిమాలతో టాలీవుడ్ లో సత్తా చాటే ప్రయత్నం చేస్తోంది.

7 /7

జాన్వీ కపూర్..రాజమౌళి, మహేష్ బాబు సినిమాతో  పాటు ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ చిత్రంలో దాదాపు జాన్వీ కథానాయికగా తీసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.