తిరుపతి, విజయవాడ లాంటి పుణ్యక్షేత్రాల్లో మరోసారి అన్యమత ప్రచారం జరుగుతోందన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. శ్రీవారు కొలవైన తిరుపతిలో మత మార్పిడులు జరుగుతున్నాయని హిందూ మత సంస్థలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. అదే తరహాలో విజయవాడలోనూ మత మార్పిడుల వ్యవహారం కలకలం రేపుతోంది. కనకదుర్గమ్మ వారి ఆలయానికి అత్యంత సమీపంలో ఉన్న పున్నమి ఘాట్ వద్ద మత మార్పిడులు జరిగాయని, దాదాపు 47 మందికి మతమార్పిడికి పాల్పడ్డారనే ప్రచారం జోరుగా సాగుతోంది. బహిరంగంగా కార్యక్రమాలు నిర్వహించడంపై స్థానికులు మండిపడుతున్నారు. మరోవైపు, పున్నమి రిసార్ట్స్ గేట్ ఆర్చ్కి మేరీమాతం విగ్రహాన్ని వేయడంపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి.
విజయవాడలో ఇప్పటికే అన్యమత ప్రచారం జరుగుతోందంటూ భారీ ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్న ప్రస్తుత తరుణంలో చోటుచేసుకుంటున్న ఈ పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయోననే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.