Sobhita Dhulipala and Naga Chaitanya wedding : నాగచైతన్య శోభిత పెళ్లి పనులు మొదలైపోయాయి. ఈరోజు శోభిత ఇంట్లో ఘనంగా పసుపుదంచే.. కార్యక్రమాన్ని జరిపార కుటుంబ సభ్యులు. ఈ ఫోటోలను శోభిత తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. నాగచైతన్య.. ఇంట్లో కార్యక్రమం కు సంబంధించిన ఫోటోలు మాత్రం ఇంకా విడుదల చేయలేదు.
టాలీవుడ్ హీరో నాగచైతన్య..సమంత నుంచి విడిపోయిన తర్వాత.. అప్పటికే వివాహమై బ్రేకప్ చేసుకున్న హీరోయిన్ శోభిత ధూళిపాళ ను వివాహం చేసుకోబోతున్నారు. గడిచిన కొన్ని నెలల క్రితం వీరిద్దరికి సంబంధించి ఎంగేజ్మెంట్ కూడా జరగడం జరిగింది. అయితే వీరి వివాహ తేదీను మాత్రం ఇంకా తెలియజేయలేదు.కానీ వివాహానికి సంబంధించి ముందుగానే కొన్ని ఆచారాలను పాటిస్తూ ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో శోభిత షేర్ చేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు.
ఇంకా వివాహ తేదీని ప్రకటించక ముందే పెళ్లికి ముందు చేసే పనులనే చూపిస్తూ ఉండడంతో వివాహాన్ని గుట్టు చప్పుడు కాకుండా చేసుకుంటున్నారు అనే అనుమానాలు కూడా మొదలవుతున్నాయి. అయితే శోభిత షేర్ చేసిన కొన్ని ఫోటోలలో వివాహానికి ముందు పసుపు దంచడం తో పాటుగా కట్టుబొట్టుతో సాంప్రదాయమైన పద్ధతిలో అన్ని పనులను చేస్తూ అందరిని ఆకట్టుకుంటుంది శోభిత.
శోభిత ప్రతి ఫోటోలో కూడా చాలా చక్కగా తన అందంతో ఆకట్టుకుంది. చిన్న చిన్న నగలతో చాలా ముస్తాబై పట్టుచీరలో తెలుగు అందం ఉట్టిపడేలా కనిపిస్తోంది శోభిత. అయితే గతంలో కూడా తన పెళ్లిని చాలా సాంప్రదాయమైన పద్ధతిలో చేసుకుంటానని చెప్పిన ఈ ముద్దుగుమ్మ, ఇప్పుడు అన్నట్టుగానే అలాంటి పనులతోనే పెళ్లి వేడుకలను మొదలుపెట్టినట్లు కనిపిస్తోంది.
శోభిత అలాగే తమ కుటుంబ సభ్యులలోని పెద్దవాళ్ల నుండి కూడా ఆశీర్వాదం తీసుకున్న ఫోటోలు కనిపిస్తున్నాయి. అలాగే తన కుటుంబ సభ్యులతో, స్నేహితులతో, చెల్లెల్లతో కలిసి శోభిత చాలా ఆనందంగా తన పెళ్లి వేడుకలను చేసుకున్నట్లుగా కనిపిస్తోంది.l ఇలా మరికొన్ని ఫోటోలకు శోభిత చాలా అందంగా ఫోజులు ఇస్తూ ఉన్నది.
అయితే వివాహ తేదీని మాత్రం అటు అక్కినేని నాగచైతన్య కుటుంబ సభ్యులు ఇటు శోభిత కుటుంబ సభ్యులు ఎవరు తెలియజేయలేదు.. మరి నాగచైతన్యకు సంబంధించి ఏవైనా ఫోటోలు రిలీజ్ చేస్తారేమో చూడాలి మరి.