Pink Idli Recipe: హెల్తీ పింక్‌ ఇడ్లీ రెసిపీ .. ఇలా చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు..

Pink Idli Recipe: సాధారణంగా టీఫిన్స్‌లో చాలా మంది ఇడ్లీలను తింటారు. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే సాధారణ ఇడ్లీల కంటే ఓట్స్‌తో తయారు చేసే పింక్‌ ఇడ్లీలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఓట్స్‌తో చేసిన ఇడ్లీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. 
 

1 /8

సాధారణ ఇడ్లీల కంటే ఓట్స్‌తో తయారు చేసే ఇడ్లీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ప్రతిరోజు బ్రేక్ ఫాస్ట్‌లో దీని తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది.   

2 /8

అయితే కేవలం ఓట్స్‌ మాత్రమే కాకుండా ఇందులోకి వివిధ రకాల కూరగాయలను ఉపయోగించవచ్చు. అందులోను పిల్లల కోసం పింక్‌ ఇడ్లీలను తయారు చేసి తినిపిస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిది. 

3 /8

పింక్‌ కలర్‌ కోసం బీట్‌ రూట్‌ ను ఉపయోగిస్తే సరిపోతుంది. దీని తయారు చేయడం ఎంతో సులభం. అయితే ఈ ఇడ్లీలను ఎలా తయారు చేయాలి అనేది మనం తెలుసుకుందాం. 

4 /8

కావలసిన పదార్థాలు: ఓట్స్ - 1 కప్పు, బీట్‌రూట్ - 1 చిన్నది, ఉప్పు - రుచికి తగినంత, నీరు - అవసరమైనంత, పెరుగు - 1/2 కప్పు, ఇడ్లీ పొడి- 1/4 కప్పు  

5 /8

 తయారీ విధానం: ఓట్స్‌ను కనీసం 4 గంటలు లేదా రాత్రి నుండి నీటిలో నానబెట్టండి.బీట్‌రూట్‌ను శుభ్రం చేసి ఉడికించి, తొక్క తీసి మెత్తగా మిక్సీలో గ్రైండ్ చేయండి.

6 /8

నానబెట్టిన ఓట్స్‌ను నీటితో కలిపి మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేయండి. ఈ మిశ్రమానికి బీట్‌రూట్ పేస్ట్, పెరుగు, ఉప్పు మరియు ఇడ్లీ పొడి (ఉపయోగిస్తే) వేసి మరోసారి బాగా మిక్స్ చేయండి. 

7 /8

పిండి పలుచగా ఉంటే కొద్దిగా ఓట్స్‌ను వేసి మళ్లీ గ్రైండ్ చేయండి. పిండిని గిన్నెలో తీసి, గుడ్డతో కప్పి గది ఉష్ణోగ్రతలో 8-10 గంటలు ఫెర్మెంట్ చేయడానికి ఉంచండి.

8 /8

ఇడ్లీ రకాలను నూనె రాసి, పిండిని పోసి స్టీమర్‌లో 15-20 నిమిషాలు ఉడికించండి.  మెత్తగా ఉడికిన పింక్ ఇడ్లీలను చట్నీ లేదా సాంబార్‌తో సర్వ్ చేయండి.