Money: ఏటీఎం నుంచి చిరిగిన కరెన్సీ నోట్లు వస్తే ఏం చేయాలి ? RBI నిబంధనలు ఏం చెబుతున్నాయో తెలుసుకోండి ?

Money: ప్రస్తుతం ఆన్‌లైన్ ద్వారా ఆర్థిక లావాదేవీలు జరుగుతున్నాయి. అయితే, కొన్ని లావాదేవీలకు నగదు అవసరం. దాని కోసం మనందరం  ATM నుండి డబ్బు తీసుకుంటాము. కానీ ఏటీఎం నుంచి డబ్బులు తీసుకునేటప్పుడు ఒక్కోసారి చిరిగిన నోటు వస్తుంది. దుకాణదారుడు, కూరగాయలు వ్యాపారులు, ఇతర వ్యాపారులు చిరిగిన నోటును స్వీకరించడానికి నిరాకరిస్తారు. కాబట్టి చిరిగిన నోట్లను ఏమి చేయాలనే ప్రశ్న మనలో వస్తుంది. అయితే ఈ విషయాన్ని స్వయంగా ఆర్బీఐ వెల్లడించింది. చెరిగిన నోటు విషయంలో RBI నియమం ఏమిటో తెలుసుకుందాం.
 

1 /5

RBI Rules: ఏటీఎంల నుంచి చిరిగిన నోట్లు బయటకు వస్తే భయపడాల్సిన పనిలేదు. RBI నిబంధనల ప్రకారం, మీరు ఈ నోట్లను బ్యాంకు నుండి మార్చుకోవచ్చు. ఈ నోట్లను తీసుకునేందుకు బ్యాంకు ఎలాంటి కండిషన్స్ పెట్టదు. అలాగే బ్యాంకులో నోట్ల మార్పిడి ప్రక్రియ కూడా పెద్దగా కష్టంగా ఏమి లేదు. ప్రక్రియ కేవలం కొన్ని నిమిషాల్లో పూర్తవుతుంది.

2 /5

చిరిగిన నోటును ATM నుండి అంటే  మీ ATMకు లింక్ ఉన్న బ్యాంకుకు తీసుకెళ్లండి. మీరు విత్ డ్రా తేదీ, సమయం, మొత్తాన్ని పేర్కొంటూ బ్యాంకుకు దరఖాస్తు రాయాలి. atm ఎవరి నుంచి డబ్బులు డ్రా చేశారో ఆ వ్యక్తి పేరు రాయాలి.  

3 /5

మీరు మీ సమీపంలోని బ్యాంక్ బ్రాంచ్ లేదా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యాలయాన్ని సందర్శించడం ద్వారా చిరిగిన నోటును సులభంగా మార్చుకోవచ్చు. ఈ చిరిగిన నోట్లను తీసుకునేందుకు బ్యాంకు నిరాకరించదు. అయితే చిరిగిన నోట్ల మార్పిడికి పరిమితిని కూడా  నిర్ణయించారు. RBI నిబంధనల ప్రకారం, ఒక వ్యక్తి ఒకేసారి గరిష్టంగా 20 నోట్లను మాత్రమే మార్చుకోవచ్చు. వాటి విలువ రూ.5000 మించి ఉండకూడదు.   

4 /5

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం, సాధారణ ఉపయోగం కారణంగా చెడిపోయిన నోటు.. రెండు ముక్కలు అయిన  నోట్.. ఆ నోట్‌లోని ముఖ్యమైన సమాచారం ఏదీ పాడుకాకపోతే, ఈ నోట్లన్నింటినీ ప్రభుత్వ బ్యాంక్, ప్రైవేట్ బ్యాంక్, బ్యాంక్ కరెన్సీ చెస్ట్ లేదా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  ఏదైనా శాఖలో మార్చుకోవచ్చు.  

5 /5

SBI చెబుతున్న రూల్ ఏంటి..?  చిరిగిన నోట్లకు సంబంధించి, భారతదేశంలోని అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని నిబంధనలు ప్రవేశపెట్టింది. బ్యాంక్‌లోని నోట్ల నాణ్యతను అధునాతన నోట్ సెట్టింగ్ మిషన్ల ద్వారా తనిఖీ చేస్తుంది. ఈ స్క్రీనింగ్ తర్వాత, ATMల నుండి చిరిగిన లేదా దెబ్బతిన్న నోట్లను స్వీకరించే అవకాశాలు చాలా తక్కువ. అయినా కూడా చిరిగిన నోట్లు దొరికితే ఏదైనా బ్యాంకు శాఖకు వెళ్లి మార్చుకోవచ్చు.