The Deal Movie Review: ‘ది డీల్’ మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే..

The Deal Movie Review: ప్రభాస్ హీరోగా నటించిన ‘ఈశ్వర్’ మూవీలో హీరో ఫ్రెండ్ పాత్రలో మెప్పించాడు హను కోట్ల. ఇపుడు చాలా యేళ్ల తర్వాత తానే హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘ది డీల్’. ఈ రోజు విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..

Written by - TA Kiran Kumar | Last Updated : Oct 18, 2024, 06:51 PM IST
The Deal Movie Review: ‘ది డీల్’ మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే..

మూవీ రివ్యూ: రివైండ్ (Rewind)

నటీనటులు: హను కోట్ల, రవి ప్రకాష్, సాయి చందన, ధరణి ప్రియ, రఘు కుంచె, మహేష్ యడ్లపల్లి, సుజాత దీక్షిత్, సురభి లలిత, శ్రీవాణి త్రిపురనేని త‌దిత‌రులు

ఎడిటర్: శ్రవణ్ కటికనేని

సినిమాటోగ్రఫీ: సురేంద్ర రెడ్డి

సంగీతం: ఆర్. ఆర్. ధృవన్

నిర్మాత: హెచ్ పద్మా రమకాంతరావు, రామకృష్ణ కొళివి

దర్శకత్వం : డాక్టర్ హను కోట్ల

విడుదల తేది: 18-10-2024

ప్రభాస్‌ ఈశ్వర్‌ సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన నటుడు హను కోట్ల. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఈయన హీరోగా నటించిన నటించిన మూవీ ‘ది డీల్’.  ఈ చిత్రానికి ఆయన దర్శకుడు కావడం విశేషం. ఆయన ఇప్పటికే ఈటీవీలో మాయాబజార్ సహా పలు సీరియల్స్, యాడ్స్ కు  డైరెక్టర్ గా వ్యవహరించిన అనుభవంతో ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. మరి ఈయన హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేసిన ‘ది డీల్’ మూవీ ఈ రోజు విడుదలైంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..   

కథ విషయానికొస్తే..
భైరవ (హను కోట్ల) ఓ యాక్సిడెంట్ కారణంగా కోమాలోకి వెళతారు. అంతేకాదు  తన గతాన్ని మరిచిపోతాడు. కోమా నుంచి బయటకు రాగానే లక్ష్మి (ధరణి ప్రియా)ని కలవాలనుకుంటాడు. ఆమె తన భార్య కాబట్టి ఆమెను కలుస్తానంటాడు. ఈ క్రమంలో తాను ఎవరనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటాడు. ఈ క్రమంలో ఇందు (సాయి చందన)ను మాధవ్ (రవి ప్రకాష్) చంపే ప్రయత్నం చేస్తాడు. ఈ కమ్రంలో ఆమెను భైరవ కాపాడి ఆమెకు సన్నిహితుడు అవుతాడు. ఈ క్రమంలో  ఇందును ఎవరు చంపుతున్నారో తెలులసుకునే క్రమంలో తన భార్య లక్ష్మిని చూసి ఆమె కలిసే ప్రయత్నం చేస్తే ఆమె మాత్రం ఇతనెవరో తెలియనట్టు ప్రవర్తిస్తుంది. అంతేకాదు మాధవ్ కు భార్యగా నటిస్తోంది. అసలు ఇందును ఎందుకు చంపాలనుకుంటున్నారు. తన భార్య తనను ఎందుకు దూరం పెట్టినట్టు. ఈ క్రమంలో తన గతం భైరవకు గుర్తుకు వచ్చిందా.. ? అసలు అతన్ని ఎవరు చంపే ప్రయత్నం చేసారు. ఈ సమాధానాలన్ని తెలియాంటే ఈ సినిమా చూడాల్సిందే.
 
కథనం, టెక్నికల్ విషయానికొస్తే..
ఈ మధ్య కాలంలో కంటెంట్ బేస్డ్ సినిమాలు చాలానే వస్తున్నాయి. ఈ క్రమంలో హను కోట్ల తనను తాను హీరోగా ప్రమోట్ చేసుకునేందుకు ‘ది డీల్  కథ’ను మంచిగానే రాసుకున్నాడు. సినిమా మొత్తం ట్విస్టులతో  నెక్ట్స్ సీన్ ఏమవుతుందా అని ప్రేక్షకుల్లో క్యూరియోసిటీ పెంచడంలో సక్సెస్ అయ్యాడు. ఓ అమ్మాయిని హత్య చేసేందుకు ఓ సుపారీ గ్యాంగ్. వాళ్ల నుంచి హీరోగా కాపాడటం అనేది ఎన్నో సినిమాల్లో ఉంది.ఇలాంటి సినిమాలు రొటిన్ గా అనిపించినా.. దాన్ని కన్విన్సింగ్ చెప్పడంలో సక్సెస్ అయ్యాడు.

ముఖ్యంగా హీరోకు  యాక్సిడెంట్‌.. ఆ తర్వాత గతాన్ని మర్చిపోవడం.. ఆ తర్వాత ఓ అమ్మాయిని కాపాడే బాధ్యతల తీసుకోవడం సినిమాలో వరుసగా పేర్చుకుంటూ వెళ్లి నెక్ట్స్ సీన్ ఏమవుతుందా ఆసక్తి కలగజేసాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం హీరో తనకు యాక్సిడెంట్ కావడం.. ఆ తర్వాత తాను ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేయడం వంటివి ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తాయి.  ఇంటర్వెల్‌లో లక్ష్మి పాత్ర ఇచ్చే ఆకట్టుకుంటుంది. అనంతరం అసలు కథ స్టార్ట్ అవుతుంది. అసలు భైరవ ఎవరు? అనే ట్విస్ట్ రివీల్ అయిన తీరు బాగుంది.

ఇదీ చదవండి:  Highest-paid villains: సైఫ్, బాబీ దేవోల్ సహా మన దేశంలో ఎక్కువ రెమ్యునరేష్ తీసుకుంటున్న క్రేజీ విలన్స్ వీళ్లే..

ఇదీ చదవండి:  Tollywood Celebrities Guinnis Records: చిరంజీవి కంటే ముందు గిన్నీస్ బుక్ లోకి ఎక్కిన తెలుగు చిత్ర ప్రముఖులు వీళ్లే..

సెకండాఫ్‌ తర్వాత డ్రామా మరింత ఆసక్తికరంగా అనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి, క్లైమాక్స్ వరకు ఒక్కో ట్విస్ట్ రివీల్‌ అవుతూ ప్రేక్షకులను ఎంగేజ్ చేయగలిగాడు. ఇందుని చంపాలనుకుంటున్నది ఎవరు? ఇంతకి అసలు ఇందు ఎవరు? అనే ట్విస్ట్ సినిమాకి హైలైట్‌ పాయింట్స్. అయితే సినిమా స్క్రీన్‌ప్లే పరంగా, ట్విస్ట్ ల పరంగా బాగానే రాసుకన్నాడు హను కోట్ల. అయితే సినిమాను ఓ క్రమంలో నడిపించే క్రమంలో  అక్కడక్కడ తడబడ్డాడు. అక్కడక్కడ సినిమా స్లోగా సాగినట్టు కనిపిస్తుంది. సినిమాలో అంతా కొత్త వాళ్లు కావడం కాస్తంత ఇబ్బంది కలిగించే అంశం.  మ్యూజిక్‌, రీ రికార్డింగ్  పరంగా ఇంకాస్త శ్రద్ద పెడితే బాగుండేది. ఓవరాల్ గా ఈ సినిమా ఓ వర్గం ప్రేక్షకులను మెప్పిస్తుంది.  సీరియల్స్ తీసిన అనుభవం ఉండటంతో కొన్ని చోట్ల సాగదీత కనిపించింది. అక్కడ దర్శకుడిగా కొంత అనుభవ లేమి కొట్టొచ్చినట్టు కనబడింది. సినిమాలో ట్విస్ట్ లు రిలీఫ్‌నిచ్చే అంశాలు. ఓ వైపు హీరోగా నటిస్తూ సినిమాని రూపొందించడం పెద్ద టాస్క్. ఈ విషయంలో దర్శకుడిని అభినందించాల్సిందే. ఈ మూవీ ద్వారా మంచి ప్రయత్నం చేశారని చెప్పొచ్చు. సినిమాకి ఆర్‌ ఆర్‌ ధృవన్‌ సంగీతం పర్వాలేదు.  శ్రవణ్‌ కటికనేని ఎడిటింగ్‌ కూడా ఇంకాస్త క్రిస్పీగా ఉంటే బాగుండేది. చాలా చోట్ల కథ అక్కడక్కడే తిరిగినట్టుగా అనిపిస్తుంది.  సురేంద్ర రెడ్డి కెమెరా వర్క్ బాగుంది. నిర్మాణ విలువలు జస్ట్ ఓకే.

నటీనటులు విషయానికొస్తే..  
భైరవ పాత్రలో డా. హను కోట్ల మంచి నటనే కనబరిచాడు. చాలా చోట్ల సెటిల్డ్ గా పర్ఫామెన్స్ చేసాు. హీరోయిజానికి పోకుండా సింపుల్ గా కనిపించి మెప్పించాడు.  సినిమాలో తన నటనలో పరిణితి చూపించాడు. హీరోయిన్ పాత్రలో నటించిన సాయి చందనతో పాటు, లక్ష్మి పాత్రలో ధరణి సైతం తమ పాత్రల్లో ఒదిగిపోయారు. రవి ప్రకాష్ నెగిటివ్ షేడ్ పాత్రలో మెప్పించాడు. మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు మెప్పించారు.

పంచ్ లైన్.. ట్విస్ట్ ఇచ్చే ‘ది డీల్’..

రేటింగ్.. 2.5/5

ఇదీ చదవండి : Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..

ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News