Diwali 2024 Deeparadhana In Telugu: హిందూ సంప్రదాయంలో దీపావళి పండగకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో, దీపారాధకు కూడా అంతే ప్రత్యేకత ఉంటుంది. ప్రస్తుతం చాలా మంది రోజు దీపారాధన చేస్తారు. కానీ దీపావళి పండగ రోజున మాత్రం భారత్లో ప్రతి ఒక్కరూ దీపారాధన చేస్తారు. అయితే దీపాలను ముట్టించి భగవంతుడిని ప్రార్థించడం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరుతాయట.
ప్రస్తుతం చాలా మంది మార్కెట్లో లభించి దీపాల నూనెతో దీపారాధన చేస్తారు. కొంతమంది మాత్రం ఎప్పుడూ కొబ్బరి నూనెతో దీపాలను వెలిగిస్తూ ఉంటారు. నిజానికి ఇలా కొబ్బరి నూనెతో దీపాలు ముట్టించడం మంచిదేనా?
దీపావళి వారం రోజుల పాటు దీపారాధన చేస్తే ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి. కొబ్బరి నూనెతో దీపాలు వెలిగించడం చాలా మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
కొబ్బరి నూనెతో వెలిగించిన దీపాలను దీపావళి రోజు వెలిగించడం వల్ల ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. అంతేకాకుండా అనేక సమస్యలు కూడా దూరమవుతాయి.
దీపారాధన చేయడం వల్ల ఆర్థిక స్థోమత కూడా పెరుగుతుంది. అంతేకాకుండా ఈ దీపావళి రోజున రావి చెట్టు కింద కొబ్బరి నూనె దీపాలు వెలిగించడం చాలా మంచిదట..
ఇలా దీపావళి నుంచి 40 రోజుల పాటు లక్ష్మీదేవికి కొబ్బరి నూనెను వెలిగించడం వల్ల ఆర్థిక పరమైన ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. దీంతో పాటు చెక్కరతో తయారు చేసిన ఆహార పదార్థాలను కూడా నైవేద్యంగా సమర్పించాల్సి ఉంటుంది.
ఇప్పటికే ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నవారు దీపావళి సమయంలో తప్పకుండా కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం చాలా మంచిది. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి.