హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వేలో 4,103 పోస్టుల భర్తీకిగాను అప్రెంటీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వెలువడింది. కనీసం 50% మార్కులతో 10వ తరగతితో పాటు ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్ధులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులుగా దక్షిణ మధ్య రైల్వే స్పష్టంచేసింది. 249 ఏసీ మెకానిక్ పోస్టులు, 16 కార్పెంటర్, 640 డీజిల్ మెకానిక్, 18 ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్, 871 ఎలక్ట్రీషియన్, 102 ఎలక్ట్రానిక్ మెకానిక్ పోస్టులు, 1,460 ఫిట్టర్, 74 మెషినిస్ట్, 24 ఎఎండబ్ల్యూ, 12 ఎంఎంటీఎం, 40 పెయింటర్, 597 వెల్డర్ పోస్టులను భర్తీ చేయనున్నట్టు ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే... డిసెంబర్ 8వ తేదీలోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు గడువు విధించింది.
అర్హతలు: కనీసం 50% మార్కులతో 10వ తరగతితో పాటు ఐటీఐ డిగ్రీ
దరఖాస్తు ఫీజు: రూ.100.
దరఖాస్తు చేసుకునేందుకు అధికారిక వెబ్సైట్ లింక్: scr.indianrailways.gov.in