PM Kisan Mandhan Yojana: కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను రైతుల కోసం అమల్లోకి తీసుకువచ్చింది. పీఎం కిసాన్ యోజన ద్వారా ఏడాదికి రూ.6,000 రైతులకు ఆర్థిక సహాయం అందజేస్తోంది. అయితే పీఎం కిసాన్ మాన్‌ధన్ యోజన ద్వారా రూ.3,000 పెన్షన్ ప్రతినెలా పొందవచ్చు. ఈ బంపర్ హిట్ స్కీమ్ గురించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
PM Kisan Mandhan Yojana: పీఎం మాన్‌ధన్ యోజన పథకం కేంద్రం రైతుల కోసం ప్రత్యేకంగా ప్రారంభించింది. వృద్ధాప్య సమయంలో వారికి అండగా ఉండేందుకు ఈ అద్భుతమైన పథకాన్ని కేంద్రం ప్రారంభించింది. ముఖ్యంగా రైతులకు ఈ పథకం ఎంతో మేలు చేస్తుంది.
ఈ పథకం కింద ప్రతి నెలా రూ.3,000 పొందవచ్చు. ఇప్పటికే ఈ పథకంపై కోట్ల మంది లబ్ధి పొందుతున్నారు. ఈ స్కీమ్ ప్రధాన లక్ష్యం రైతుల అభ్యున్నతి, ఆర్థికంగా వారికి ఆసరాగా ఉండటం. ఈ పథకంతో వారికి ఎలాంటి లాభాలు కలుగుతాయి? ఎలా దరఖాస్తు చేసుకోవాలి తెలుసుకుందాం.
పీఎం కిసాన్ మాన్‌ధన్ యోజనకు దరఖాస్తు చేసుకునేవారు కచ్చితంగా 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. 60 ఏళ్లు దాటిన తర్వాత ఈ పెన్షన్‌కు అర్హులు అవుతారు. దీంతో వారు ప్రతినెలా రూ.3,000 పింఛను పొందుతారు. అయితే, ఈ స్కీములో ప్రతినెలా రూ.55 నుంచి రూ.200 కట్టాల్సి ఉంటుంది.
ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేవారు బ్యాంకు ఖాతా కచ్చితంగా కలిగి ఉండాలి. దీంతోపాటు ఆధార్ కార్డు, పీఎం కిసాన్ యోజన పథకంలో రిజిస్టర్ అయి ఉండాలి. పీఎం కిసాన్ మాన్‌ధన్ యోజనకు భార్యా భర్తలు ఇద్దరు అర్హులు. పింఛనుదారుడు మరణించిన తర్వాత పూర్తి డబ్బు భార్య లేదా నామినీకి దక్కుతుంది.
దరఖాస్తు చేసుకునే విధానం.. పీఎం కిసాన్ మాన్‌ధన్ యోజన దరఖాస్తు చేసుకోవాలంటే మీ దగ్గరలోని బ్యాంకులో దరఖాస్తు చేసుకోవాలి. అక్కడ ఫారమ్ నింపి మీ వివరాలను, పథకానికి కావాల్సిన డాక్యుమెంట్లను కూడా జత చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. పీఎం కిసాన్ మంధాన్ యోజన బ్యాంకుల్లో అందుబాటులో ఉంటాయి. ఇందులో యాక్సిడెంట్ కవరేజీ కూడా పొందుతారు.
పీఎం కిసాన్ మాన్‌ధన్ యోజన (PMKMY) 2019 సెప్టెంబర్ ప్రారంభించారు. చిన్నా సన్నకారు రైతులకు వృద్ధాప్యంలో ఆర్థికంగా చేయూత అందించడమే ప్రధాన లక్ష్యంగా ప్రారంభించారు. ఖాతాలో మీరు రూ.55 డిపాజిట్ చేస్తే కేంద్ర ప్రభుత్వం మరో రూ. 55 డిపాజిట్ చేస్తుంది. దీంతో ప్రతి నెలా మీ ఖాతాలో రూ.110 జమా అవుతుంది.
మాన్‌ధన్ యోజనకు అధికారిక వెబ్సైట్ mmandhan.in లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో ఎన్రోల్ చేసుకోవడానికి మీకు ఓటీపీ వస్తుంది.అక్కడ మీ వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.