అమరావతి: ఓటర్ల జాబితా పరిశీలనకు నవంబర్ 18వ తేదీ వరకు గడువు పెంచుతూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కె.విజయానంద్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఓటరు నమోదు కార్డులో పేర్లు, చిరునామాలో తప్పులు ఏమైనా వుంటే, గడువు ముగిసేలోగా వాటిని సవరించుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సూచించారు. నవంబరు 25 నుంచి డిసెంబరు 24 వరకు అభ్యంతరాలను స్వీకరించి, జనవరి 10వ తేదీ నాటికి అభ్యంతరాలన్నీ పరిష్కరిస్తామని.. ఆ తర్వాత జనవరి 20న ఓటర్ల తుది జాబితాను ప్రకటిస్తామని స్పష్టంచేశారు.
Did you verify your name in the electoral roll?#ElectionCommissionOfIndia #ECI #GoVerify #GoRegister@SpokespersonECI pic.twitter.com/UmREBEdWCU
— Election Commission of India #SVEEP (@ECISVEEP) October 15, 2019
ఇదిలావుంటే, ఇప్పటికే భారీ సంఖ్యలో దరఖాస్తులు వెల్లువెత్తాయని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. నిర్ణీత గడువులోగా దరఖాస్తులను పరిష్కరిస్తామని సీఈసి తేల్చిచెప్పింది.
ఓటర్ల జాబితా పరిశీలనకు గడువు పెంచిన ఈసి