/telugu/photo-gallery/hero-sai-durga-tej-emotional-with-his-mama-pawan-kalyan-pics-goes-viral-rv-180879 Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు 180879

Volunteer System: ఏపీలో తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చాక గత వైసీపీ ప్రభుత్వంలో ఉన్న వాలంటీర్ల వ్యవస్థపై సందిగ్దత ఏర్పడింది. ప్రస్తుతం వాలంటీర్ల వ్యవస్థ పెండింగులో ఉంది. నాలుగు నెలలుగా జీతాల్లేవు. వాలంటీర్ల వ్యవస్థ కొనసాగుతుందా లేదా అనే్ది స్పష్టత లేదు. 

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారిన తరువాత వాలంటీర్ల వ్యవస్థ ప్రశ్నార్ధకమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2 లక్షల 50 వేల వేల వాలంటీర్లు తమ పరిస్థితి ఏంటో తెలియక ఆందోళన చెందుతున్నారు. వాలంటీర్లను కొనసాగిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చినా అధికారంలో వచ్చాక ఎలాంట నిర్ణయం తీసుకోలేదు. అధికారంలో వచ్చాక ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నా ఇంకా ఆ దిశగా ప్రయత్నాలు కన్పించలేదు. అయితే ఇప్పుడు వాలంటీర్ల విషయంలో స్పష్టత ఇవ్వనుందని తెలుస్తోంది. ఈ నెల 10 వతేదీన జరగనున్న కేబినెట్ భేటీలో ఏపీ ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. 

అక్టోబర్ 10వ తేదీన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో కేబినెట్ భేటీ జరగనుంది. ఈ భేటీలో వాలంటీర్ల వ్యవస్థపై చర్చ జరగనుందని తెలుస్తోంది. వాలంటీర్లను తిరిగి విధుల్లో తీసుకోవడంతోపాటు గౌరవ వేతనం 10 వేలు చేసేలా నిర్ణయం తీసుకోవచ్చని సమాచారం. గత నాలుగు నెలల జీతం కూడా ఇవ్వనుందని తెలుస్తోంది. 

ఏపీలో గత ప్రభుత్వం ఆధ్వర్యంలో వాలంటీర్ల వ్యవస్థ అమల్లో ఉంది. ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ నియామకం జరిగింది. ప్రతి నెలా పింఛన్లు అందించడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పధకాల విధులు నిర్వహించేవారు. మార్చ్ నెలలో ఎన్నికల షెడ్యూల్ రాగానే వాలంటీర్ల వ్యవస్థను ఎన్నికల సంఘం నిలుపుదల చేసింది. ఆ తరువాత అధికారం మారడంతో కొత్త ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వాలంటీర్ల వ్యవస్థపై ముఖ్యమంత్రి చంద్రబాబు సహా మంత్రులు స్పందించినా కొనసాగించే విషయం మాత్రం స్పష్టం చేయలేదు. అయితే ఈసారి జరగనున్న కేబినెట్ భేటీలో నిర్ణయం ఉంటుందని అంచనా. 

Also read: Cyclone Alert: బంగాళాఖాతంలో తుపాను హెచ్చరిక, ఏపీకు మూడు రోజులు భారీ వర్ష సూచన

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Section: 
English Title: 
Andhra pradesh Cabinet Meeting on october 10 government to take decision on Volunteer System rh
News Source: 
Home Title: 

Volunteer System: వాలంటీర్లకు గుడ్‌న్యూస్, త్వరలో కేబినెట్ భేటీలో నిర్ణయం

Volunteer System: వాలంటీర్లకు గుడ్‌న్యూస్, త్వరలో కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకోనున్న మంత్రివర్గం
Caption: 
AP Volunteer ( file photo)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Volunteer System: వాలంటీర్లకు గుడ్‌న్యూస్, త్వరలో కేబినెట్ భేటీలో నిర్ణయం
Md. Abdul Rehaman
Publish Later: 
No
Publish At: 
Monday, October 7, 2024 - 12:01
Created By: 
Md. Abdul Rehaman
Updated By: 
Md. Abdul Rehaman
Published By: 
Md. Abdul Rehaman
Request Count: 
19
Is Breaking News: 
No
Word Count: 
245