Telangana Crime News: రాష్ట్రంలో దారుణం.. ఆశ్రయం ఇచ్చి.. ఇద్దరు బాలికలపై గ్యాంగ్‌రేప్

Minor Girls Gang Rape Case: ఇద్దరు మైనర్ బాలికలను నమ్మించి ఐదుగురు యువకులు అత్యాచారం చేశారు. హైదరాబాద్‌లోని ఓ పునరావాస కేంద్రం నుంచి జనగాం బస్టాండ్‌కు వెళ్లిన ఇద్దరు బాలికలకు ఆశ్రయం కల్పిస్తామని.. అఘాయిత్యానికి పాల్పడ్డారు. పోలీసులు వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా..  

Written by - Ashok Krindinti | Last Updated : Oct 4, 2024, 01:01 PM IST
Telangana Crime News: రాష్ట్రంలో దారుణం.. ఆశ్రయం ఇచ్చి.. ఇద్దరు బాలికలపై గ్యాంగ్‌రేప్

Minor Girls Gang Rape Case: తెలంగాణలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆశ్రయం కల్పించి ఇద్దరు బాలికలపై ఐదుగురు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. హైదరాబాద్ ఐఎస్ సదన్‌లోని పునరావాస కేంద్రం నుంచి పారిపోయిన ఇద్దరు బాలికలకు ఐదుగురు యువకులు మాయమాటలు చెప్పి అత్యాచారం చేశారు. పోలీసులు అమ్మాయిలను గుర్తించి ఆరాతీయగా విషయం బయటికొచ్చింది. దీంతో నిందితులను అరెస్ట్ చేశారు. వివరాలు ఇలా.. జనగామ, మల్కాజిగిరికి చెందిన 14, 15 ఏళ్ల బాలికలు ఉమెన్స్‌ డీఅడిక్షన్‌ అండ్‌ రిహాబిలిటేషన్‌ సెంటర్‌ నుంచి పారిపోయి బయటకు వచ్చారు. గత నెల 24న బస్‌లో జనగామ బస్టాండ్‌కు చేరుకున్నారు. అక్కడ ఓ యువకుడిని ఫోన్ అడిగి తెలిసిన వ్యక్తికి ఫోన్ చేశారు. తాము జనగామలో ఉన్నామని అక్కడికి రావాలని వాళ్లు చెప్పారు.

Also Read: Mark Zuckerberg :  పక్కకెళ్లీ ఆడుకో తమ్ముడు.. మస్క్‌కు మార్క్‌ షాక్.. దెబ్బకు టాప్‌లోకి వచ్చాడుగా..!

అయితే తాను అందుబాటులో లేనని.. తరువాతి రోజు వస్తానని అవతలి వ్యక్తి చెప్పాడు. తమకు ఏం చేయాలో దిక్కుతోచని ఆ ఇద్దరు బాలికలు.. తమకు ఫోన్ ఇచ్చిన యువకుడు సాయి(25)ని సాయం కోరారు. తాము ఉండేందుకు ఆశ్రయం ఇవ్వాలని కోరారు. ఇద్దరు బాలికలను తీసుకువెళ్లి తన స్నేహితుడి బేకరీలో రాత్రి ఉంచాడు. అక్కడే స్నేహితుడితో కలిసి ఇద్దరు బాలికలపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని తమ స్నేహితులకు కూడా చెప్పారు. మరుసటి రోజు అందరూ కలిసి కారులో బాలికలు ఇద్దరిని ఆలేరుకు తీసుకువెళ్లే క్రమంలో మరోసారి అత్యాచారానికి పాల్పడ్డారు. 

అనంతరం బాలికలను వాళ్లకు తెలిసిన వ్యక్తికి అప్పగించి వెళ్లిపోయారు. జనగామ బస్టాండ్‌కు ఇద్దరు బాలికలు తిరిగి రాగా.. అనుమానస్పదంగా కనిపించడంతో పోలీసులు వివరాలు ఆరా తీశారు. దీంతో జరిగిన దారుణాన్ని మొత్తం వివరించారు. నిందితులను నాగరాజు, అతని స్నేహితులు  సాయి, రాజు, అఖిల్, రోహిత్‌గా గుర్తించారు. అందరినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనపై సైదాబాద్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 
 

Also Read: PM Kisan Yojana: రేపే రైతుల ఖాతాల్లో రూ.2000 జమా.. కేవైసీ పూర్తి చేశారా? హెల్ప్‌లైన్‌ నంబర్స్‌ ఇవే..  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News