Samsung Galaxy M05 Discount Offer: ఎప్పటి నుంచో రూ.6 వేల లోపే మంచి స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇది అద్భుతమైన అవకాశంగా భావించవచ్చు. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా కొన్ని బ్రాండ్‌లకు సంబంధించిన స్మార్ట్‌ఫోన్స్ అత్యధిక తగ్గింపుతో లభిస్తున్నాయి. దీంతో పాటు అదనంగా ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిని వినియోగించి కొనుగోలు చేసేవారికి దాదాపు రూ.6 వేల లోపే మంచి మొబైల్ పొందవచ్చు. అయితే అమెజాన్‌లో ఏ స్మార్ట్‌ఫోన్ అత్యధిక తగ్గింపుతో బడ్జెట్‌లో లభిస్తుందో ఇప్పుడు తెలుసుకోండి.
ఇటీవలే సాంసంగ్ మార్కెట్‌లోకి లాంచ్ చేసిన గెలాక్సీ M05 స్మార్ట్‌ఫోన్ భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఈ మొబైల్ కేవలం ఒకే ఒక వేరియంట్‌లో అందుబాటులో ఉంటుంది. ఇక దీని ధర వివరాల్లోకి వెళితే.. కంపెనీ మార్కెట్‌లో 4GB ర్యామ్, 64GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన మొబైల్‌ను MRP ధర రూ.9,999తో విక్రయిస్తోంది. అయితే దీనిని అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి దాదాపు 35 శాతం తగ్గింపుతో రూ.6,499కే పొందవచ్చు. ఇవే కాకుండా ఈ మొబైల్ అత్యధిక తగ్గింపుతో పొందడానికి బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.
ఇక ఈ మొబైల్ EMI ఆప్షన్‌తో కొనుగోలు చేసేవారికి ప్రత్యేకమైన నో కాస్ట్ ఆప్షన్ కూడా లభిస్తోంది. దీనిని పొందడానికి ముందుగా అమెజాన్ పే ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి పేమెంట్ చేసే క్రమంలో EMI ఆప్సన్ చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేస్తే నో కాస్ట్ EMI ఆప్షన్ కూడా లభిస్తుంది. అలాగే దీనిపై అదనంగా ఎక్చేంజ్ ఆఫర్ కూడా లభిస్తోంది. ఈ ఆఫర్ పొందడానికి పాత కండీషన్ కలిగిన మంచి బ్రాండ్ స్మార్ట్‌ఫోన్‌ను ఎక్చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే దాదాపు రూ.6,100 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో ఈ ఆఫర్స్ అన్ని పోనూ ఈ మొబైల్ కేవలం రూ.399కే పొందవచ్చు.
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
టాప్ 10 ఫీచర్స్, స్పెషిఫికేషన్స్:
50MP డ్యూయల్ కెమెరా
6.7 అంగుళాల HD+ డిస్‌ప్లే
5000mAh బ్యాటరీ
మీడియాటెక్ హీలియో G85 ప్రాసెసర్
4GB మల్టీటాస్కింగ్ ర్యామ్
64GB శక్తివంతమైన స్టోరేజ్
Android 14 ఆపరేటింగ్ సిస్టమ్
25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్
డ్యూయల్ సిమ్ సపోర్ట్
3.5mm హెడ్‌ఫోన్ జాక్
మైక్రో SD కార్డ్ స్లాట్
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.