LPG Price Hike in October: పండుగ ముందు సామాన్యులకు బిగ్ షాక్ తగిలింది. అక్టోబర్ మొదటి రోజు సిలిండర్ ధరలు పెంచి షాకిచ్చాయి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు. ప్రతి నెలా మొదటి రోజు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు గ్యాస్ ధరలను సవరిస్తాయి. ఈ సందర్భంగా ఈ నెల కూడా ఆయిల్ ధరల్లో భారీ మార్పులు చేశాయి.
19 కేజీల గ్యాస్ సిలిండర్ ధరలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు అక్టోబర్ 1 నేటి నుంచి పెంచేశాయి. ఈ తాజా ధరల సవరణతో రూ.50 గ్యాస్ ధరలు పెరిగాయి. దీంతో కమర్షియల్ సిలిండర్ ధరలు రూ.1741.50 ఢిల్లీలో పెరగనుంది. గత నెలలో కంటే రూ.39 పెంచాయి.
జూలై నెలలో 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను రూ.30 తగ్గించాయి. అంతకు ముందు జూన్ నెలలో రూ.69.50 ధరలను తగ్గించేసి రూ.1676 అందుబాటులో ఉంచాయి. మే నెలలలో రూ. 19 తగ్గించాయి. ఈసారి పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలకు అసలు కారణం ఇంకా అధకారికంగా ప్రకటించలేదు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ధరలను కూడా పరిగణలోకి తీసుకుంటారు
మిడిల్ ఈస్ట్ దేశాలు ముఖ్యంగా ఇజ్రాయెల్, లెబనాన్ యుద్ధం నేపథ్యంలో కూడా ఈ ధరలను పెంచేసి ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. పెరిగిన ధరలు ముఖ్యంగా రెస్టారెంట్లు, హోటళ్లు, క్యాటరింగ్ వ్యాపారం చేసే వారిపై తీవ్ర ప్రభావం చూపనుంది. వీరికి ఇక ఎల్పీజీ కమర్షియల్ ధరలను పెను భారంగా మారనున్నాయి. ఇది హాస్పిటాలిటీ రంగానికి కూడా పెద్ద దెబ్బ అని చెప్పుకోవచ్చు.
పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు ముఖ్యంగా దసరా, దీపావళి ముందు జరిగింది. అయితే, డొమెస్టిక్ వంట గ్యాస్ ధరల్లో ఎలాంటి ార్పులు జరగలేదు. హైదరాబాద్లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు నేటి నుంచి రూ. 1,967, డొమోస్టిక్ రూ.855 ధరల వద్ద ఉన్నాయి.
కమర్షియల్ వంట గ్యాస్ ధరలు చిన్న పరిశ్రమలపై కూడా ప్రభావం చూపనుంది. ఇది ఉత్పత్తి ధరలను పెంచుతుంది. ఎల్పీజీ ధరల పెరుగుదల కూడా వస్తువులు, సర్వీసుల ధరలపై కూడా ప్రభావం చూపుతుంది.
ముఖ్యంగా దసరా, దీపావళి పండుగల ముందు ఈ ధరల పెరుగుదల పరోక్షంగా సామాన్యులపై ప్రభావం చూపుతుంది. అయితే, కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఉజ్వల యోజనా ద్వారా సామాన్యులకు తక్కువ ధరలోనే గ్యాస్ సిలిండర్ ను అందిస్తుంది.