Balakrishna about Senior heroes : హిందీలో కాఫీ విత్ కరన్ షో ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇక ఇంచుమించుగా అలాంటి ఫార్ములానే ఫాలో అవుతూ.. తెలుగులో బాలకృష్ణ హోస్ట్గా అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె వచ్చింది. అయితే ఈ షో మరింత విజయం సాధించింది. ఈ షో బాలకృష్ణలోని మరో యాంగిల్ ని సైతం చూపించింది.
కాగా ఈ మధ్యనే బాలకృష్ణ తెలుగు ఇండస్ట్రీలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందుకుగాను మొన్న దుబాయిలో జరిగిన ఐఫా అవార్డుల వేడుకలు.. నందమూరి బాలకృష్ణ అని సన్మానించారు. ఆయనకు లెగసి అవార్డు సైతం అందించారు. ఈ అవార్డుల వేదికలో.. కరణ్ జోహార్.. బాలకృష్ణతో రాపిడ్ ఫయర్ రౌండ్ ఆడారు. ఇందులో భాగంగా ఎన్నో ప్రశ్నలు అడిగారు.
అయితే అన్ని ప్రశ్నలలో కన్నా.. కరణ్ అడిగిన ఒక ప్రశ్న.. అందరినీ ఆకట్టుకుంది. ఇంతకీ ఆ ప్రశ్న ఏమిటి అంటే.. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ లో మీకు ఎవరు ఫేవరెట్ హీరో అని అడిగారు. దానికి సమాధానంగా బాలకృష్ణ.. మీకు ఖాన్స్ లో ఎవరు ఇష్టం అని అడుగగా.. కరణ్ వెంటనే తాను ఈ స్థాయిలో ఉన్న దానికి కారణమైన షారుక్ అంతే తనకు ఇష్టమని చెప్పారు. ఇప్పుడు మీకు ఎవరు ఇష్టమో చెప్పండి అని కరణ్ మళ్ళీ అడగగా.. ముగ్గురు లెజెండ్స్ అని సమాధానమిచ్చారు బాలకృష్ణ. కాగా ఈ కార్యక్రమానికి.. చిరంజీవి, వెంకటేష్ సైతం అటెండ్ కావడం విశేషం.
ప్రస్తుతం బాలయ్య చెప్పిన ఈ సమాధానం తెగ వైరల్ అవుతుంది. కాగా బాలకృష్ణ త్వరలోనే మరోసారి అన్ స్టాప్ అబుల్ విత్ ఎన్బికె షో తో రానున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం బాబి దర్శకత్వంలో వచ్చే సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఇక తన కొడుకు మోక్షాజ్ఞ సినిమా గురించి కూడా.. దగ్గర ఉంది మరీ బాలయ్య జాగ్రత్త తీసుకుంటున్నారని వినికిడి.
మరో పక్క చిరంజీవి విశ్వంభర సినిమా షూటింగ్తో బిజీగా ఉన్నారు. చిరంజీవి ఈ సినిమాని సంక్రాంతికి విడుదల చేయాలని ప్లానింగ్ లో ఉండగా.. ప్రస్తుతం అది కుదిరేలా లేదని వినికిడి. మరోపక్క వెంకటేష్ తనకు ఎఫ్2 లాంటి మంచి విజయం అందించిన అనిల్ రావిపూడి తో మరో సినిమా చేస్తున్నారు.
#KaranJohar asked #Balakrishna who his favorite hero between #Chiranjeevi, #Nagarjuna, and #Venkatesh was.
Here's Balakrishna’s epic response #IIFA2024 pic.twitter.com/qexmpnmU3F
— KLAPBOARD (@klapboardpost) September 29, 2024
Read more: Hydra Victims: నీ అయ్య జాగీరా ఎవడ్రా నువ్వు మా ఇల్లు కూలగొట్టేది.. హైడ్రా వర్సెస్ మూసీ బాధితులు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.