Nirmala Sitharaman: నిర్మల సీతారామన్ కు బిగ్ షాక్.. కేసు నమోదు చేయాలన్నకోర్టు..

Bengaluru court: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర మంత్రిపై కేసు నమోదు చేయాలని కూడా.. కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Written by - Inamdar Paresh | Last Updated : Sep 28, 2024, 09:07 AM IST
  • కోర్టులో నిర్మలకు చుక్కెదురు..
  • పోలీసులపై సీరియస్ అయిన కోర్టు..
Nirmala Sitharaman: నిర్మల సీతారామన్ కు బిగ్ షాక్.. కేసు నమోదు చేయాలన్నకోర్టు..

Police case against Nirmala Sitharaman: కేంద్ర ఆర్థిక మంత్రికి కోర్టు అనుకొని ట్విస్ట్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో నిర్మలపై కేసు నమోదు చేయాలని కూడా.. బెంగళూర్ తిలక్ నగర్ ఠాణా పోలీసులకు చట్టసభ ప్రతినిధుల సభ కీలక ఆదేశాలు జారీ చేసింది. నిర్మలా.. ఎన్నికల బాండ్ల పేరిట.. కొంత మంది పారిశ్రామిక వేత్తలను బెదిరించారని కూడా.. జనాధికారసంఘర్ష పరిషత్తుకు చెందిన ఆదర్శ్ అయ్యార్ గతంలో తిలక్ నగర్ పీఎస్ లో ఫిర్యాదు చేశాడు.

కానీ పోలీసులు ఫిర్యాదు స్వీకరించలేదని తెలుస్తోంది. దీంతో ఆయన న్యాయస్థానంను ఆశ్రయించారు.  దీంతో ఈ పిటిషన్ ను  విచారించిన బెంగళూరు కోర్టు.. పోలీసులపై తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసింది.. వెంటనే నిర్మల సీతారామన్ పై కేసు నమోదు చేయాలని కూడా.. పోలీసులను ఆదేశించింది. అదే విధంగా  కేసు విచారణను అక్టోబరు 10 కి వాయిదా వేసినట్లు తెలుస్తోంది. 

ఇదిలా ఉండగా కేంద్ర మంత్రిపై అభియోగాల నేపథ్యంలో కేసు నమోదు చేయక పోవడంపై అపోసిషన్ లీడర్లు సైతం తీవ్రస్థాయిలో ఖండించినట్లు తెలుస్తోంది. చట్టం ముందు అందరు సమానమేనని..పోలీసులు ఈ విధంగా చేయడాన్ని తప్పుపట్టినట్లు సమాచారం. మరోవైపు కోర్టు ఆదేశాలతోనైన పోలీసులు కేసు నమోదు చేస్తారో లేదా అనేది మాత్రం చూడాల్సి ఉంది.

Read more: Devara Actor Video: నాకు మోదీ కన్నా.. రాహుల్ గాంధీ గారే ఇష్టం.. ప్రశంసలు కురిపించిన దేవర నటుడు.. వీడియో వైరల్..

మోదీ మూడో సారి అధికారంలోకి వచ్చాక తనదైన శైలీలో పాలన అందిస్తున్నారు. కేంద్రంలో మిత్రపక్షాలతో ప్రభుత్వంను ఏర్పాటు చేసిన మోదీ.. ఇటు ఏపీకి, మరోవైపు బీహార్ కు బడ్జెట్ లో భారీగా కేటాయింపులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఏపీ విషయానికి వస్తే .. పోలవరం బాధ్యత తమదేనని కూడా కేంద్రం పలు మార్లు చెప్పింది. ఇప్పటికే భారీగా నిధుల కేటాయింపులుకూడా చేసిన విషయం తెలిసిందే.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News