New Rules From October: అక్టోబర్‌ 1 నుంచి 5 కొత్త రూల్స్‌.. ఏమిటీ ఆ భారీ మార్పులు ముందుగానే తెలుసుకోండి..

New Rules From 2024 October 1st: మరో ఐదు రోజుల్లో అక్టోబర్‌ మాసం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ మాసం మొదటి రోజు నుంచి 5 భారీ కొత్త మార్పులు జరగనున్నాయి. ఈనెల సెప్టెంబర్‌ మాసంలో కూడా కొత్త మార్పులు జరిగాయి. ముఖ్యంగా అక్టోబర్‌ మాసమే కాదు ప్రతినెలా మొదటి రోజు ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్‌ ధరల రేటు మారుతుంది. అంతేకాదు క్రెడిట్‌ కార్డు రూల్స్, బ్యాంకుల్లోని సేవింగ్స్‌ ఖాతా వంటి ఐదు మార్పులు చోటు చేసుకుంటున్నాయి.ఆ వివరాలు తెలుసుకుందాం.
 

1 /5

ఎల్‌పీజీ సిలిండర్‌.. ప్రతినెలా మొదటి రోజు ఎల్‌పీజీ సిలిండర్‌ ధరల్లో మార్పులు జరుగుతాయి. ఈరోజు ప్రస్తుతం ఉన్న సిలిండర్‌ ధరలు తగ్గవచ్చు, లేదా పెరగచ్చు.ఇంతేకాదు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ సేవింగ్స్‌ ఖాతాలకు సంబంధించిన మార్పులు కూడా జరుగుతాయి.

2 /5

క్రెడిట్‌ రూల్స్‌.. ఈ రోజు నుంచి సెబీ స్టాక్‌ మార్కెట్‌ బోనస్‌ క్రెడిట్‌కు సంబంధించి కొత్తరూల్స్‌ను కూడా ప్రకటించనుంది. అక్టోబర్‌ 1 నుంచి దీన్ని అమలు చేయనుంది. సెబీ షేర్‌ క్రెడిట్‌ రెండు రోజులకు తగ్గించింది. ఆ తర్వాత బోనస్‌ షేర్‌ రికార్డు తేదీకి రెండు రోజుల్లో అందించనున్నారు.

3 /5

ట్రాయ్‌ రూల్స్‌.. అంతేకాదు అక్టోబర్‌ 1 నుంచి ట్రాయ్‌ రూల్స్‌లో భారీ మార్పులు చేయనుంది.  జియో, ఎయిర్‌టెల, బీఎస్‌ఎన్‌ఎల్ కు సంబంధించిని 4g,5g సేవల నాణ్యతన కూడా మెరుగుపరచుకోనున్నాయి. నిబంధనలను అతిక్రమించిన టెలికాం కంపెనీలక భారీ పెనల్టీ కూడా విధిస్తారు. అంటే కొన్ని యూఆర్‌ఎల్‌, ఏపీకే లింకులు ఎస్‌ఎంఎస్‌ల ద్వారా యూజర్లకు పంపించకూడదు.

4 /5

సుకన్య సమృద్ధి యోజన.. ఈ పథకంలో కేవలం తల్లిదండ్రులు మాత్రమే కాదు గ్రాండ్‌ పేరెంట్స్‌ కూడా తన మనవరాళ్ల పేరిట సుకన్య సమృద్ధి యోజన ఖాతాను ఓపెన్‌ చేస్తున్నారు. దీంతో ఒకటి కంటే ఎక్కువ ఖాతాలు ఓపెన్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా గ్రాండ్‌ పేరెంట్స్‌ తమ మనవరాళ్ల పేరిట ఖాతా ఓపెన్‌ చేస్తే కచ్చితంగా గార్డియన్‌షిప్‌ తీసుకోవాలి. లేదా కేవలం తల్లిదండ్రులు, గార్డియన్‌ మాత్రమే ఓపెన్‌ చేయాలి. ఈ కొత్త రూల్‌ అక్టోబర్‌ 1 నుంచి అమలు కానుంది.

5 /5

పీపీఎఫ్‌ రూల్స్‌.. అక్టోబర్‌ 1 నుంచి పీపీఎఫ్ రూల్స్‌లో కూడా 3 మార్పులు చేయనున్నారు. ఒకటి కంటే ఎక్కువ ఖాతాలు ఉన్న ఖాతాదారులపై యాక్షన్‌ తీసుకోనున్నారు. 18 ఏళ్లలోపు ఉన్నవారికి పోస్టాఫీస్‌ పథకంలో వడ్డీ కూడా చెల్లించరు.