గుర్దాస్‌పూర్: బాణాసంచా తయారు చేస్తుండగా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించిన ఘటనలో 16 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోగా ఇంకొందరు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. పంజాబ్‌లోని గుర్దాస్‌పూర్‌లో బుధవారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ ఘటనలో ఫ్యాక్టరీ మొత్తం నేలమట్టమైంది. బాణాసంచా ఫ్యాక్టరీ జనావాసాల మధ్య ఉండటంతో పేలుడు ధాటికి వ్యాపించిన పొగతో చుట్టుపక్కల ఉన్న స్థానికులకు ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా మారింది. బాణసంచా తయారీదారులను ఉలిక్కిపడేలా చేసిన ఈ ఘటనపై పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టేన్ అమరిందర్ సింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. జిల్లా కలెక్టర్, ఎస్పీలు ఘటనాస్థలంలోనే ఉండి సహాయచర్యలను పర్యవేక్షిస్తున్నారని ముఖ్యమంత్రి తెలిపారు.
Deeply anguished to learn of the loss of lives due to the blast in the firecracker factory in Batala. Rescue operations are underway with the DC & SSP heading the relief efforts.
— Capt.Amarinder Singh (@capt_amarinder) September 4, 2019
ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, పంజాబ్ పోలీసు బృందాలు సహాయ చర్యల్లో పాల్గొంటున్నాయి. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.