Tirumala Laddu Animal Fat: తిరుమల లడ్డూపై జరుగుతున్న దుష్ప్రచారం.. సంచలన ఆరోపణలపై దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. లడ్డూ తయారీలో జంతు కొవ్వు వినియోగించారని సీఎం చంద్రబాబు, మంత్రులు చేస్తున్న ఆరోపణలపై తీవ్ర వివాదం రాజుకుంది. ఈ అంశం ఏపీలో రాజకీయ రచ్చ కొనసాగుతుండగా.. తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం ఈ ఆరోపణలపై స్పందించింది. అయితే టీటీడీ ఈ ఆరోపణలపై సంచలన ప్రకటన చేసింది. జంతు కొవ్వు వినియోగించామని స్పష్టమైన ప్రకటన మాత్రం చేయలేదు. డొంక తిరుగుడు సమాధానం ఇవ్వడంతో మరింత గందరగోళం ఏర్పడింది. 'కేవలం ఆరోపణలు వస్తున్నాయి' అని ప్రకటించడం గమనార్హం.
Also Read: Pawan Kalyan: నాగుపాము ఉంగరం ధరించిన డిప్యూటీ సీఎం పవన్.. ఆ రింగ్ ధరిస్తే ఏమవుతదో తెలుసా?
తిరుమల లడ్డూ నాణ్యతపై జరుగుతున్న ప్రచారంపై శుక్రవారం తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓ శ్యామలరావు కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమలలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 'లడ్డు నాణ్యత తగ్గిందని భక్తులు ఫర్యాదు చేశారు. ఏఆర్ సంస్థ సరఫరా చేసిన నెయ్యి తప్ప మిగతా అంత బాగానే ఉంది' అని ప్రకటించారు. 'ఏఆర్ సరఫరా చేసిన నాలుగు ట్యాంక్‌లో నాణ్యత లేదని తెలిసింది. బయట ల్యాబ్‌లో పరీక్ష చేయించాం. టీటీడీకి సొంత ల్యాబ్ లేదు' అని తెలిపారు.
Also Read: Leaders Jump: జనసేనలోకి నాయకుల భారీ క్యూ.. నిండుకుంటున్న 'గాజు గ్లాస్' పార్టీ
'రూ.320 నెయ్యి రాదని చాలామంది చెప్పారు. అందుకే పరీక్షలకు పంపించాం. జులై 6, 12 తేదీల్లో వచ్చిన రెండు ట్యాంకులు పరీక్షలకు పంపాం. నెయ్యి నాణ్యతపై 36 రకాల పరీక్షలు చేయించాం' అని టీటీడీ ఈఓ శ్యామల రావు వివరించారు. 'టీటీడీకి ప్రస్తుతం 4 సంస్థలు నెయ్యి సరఫరా చేస్తున్నాయి. ల్యాబ్ పరీక్షలో 116 వేల్యూ వచ్చింది. 102 కంటే తక్కువ ఉండాలి కానీ అలా రాలేదు. మిల్క్ ఫ్యాట్ 96 - 104 మధ్య ఉండాల్సింది 20.32 వచ్చింది' అని వెల్లడించారు.
'ఒక కంటేన్మేషన్ కాదు అన్ని రకాలుగా నాణ్యత లోపించింది. చేసిన అన్ని పరీక్షలో ఉండాల్సిన వేల్యూ రాలేదు. పరీక్షల తర్వాత సరఫరాను ఆపేశాం. తిరుమలను భక్తులు అంతో పవిత్రంగా భావిస్తారు. జంతు కొవ్వు వాడుతున్నారని ఫిర్యాదులు ఉన్నాయి' అని టీటీడీ ఈఓ శ్యామల రావు వివరించారు. అయితే టీటీడీ ప్రకటనలో ఎలాంటి స్పష్టత రాకపోగా మరింత గందరగోళం ఏర్పడింది. అసలు జంతు కొవ్వు ఉందా లేదా అని టీటీడీ ఈఓ స్పష్టమైన ప్రకటన చేయకపోవడం గమనార్హం. ఇది కేవలం రాజకీయ వివాదం తప్ప వాస్తవంగా లడ్డూలో జంతు కొవ్వు వాస్తవం కాదని తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.