Milad Un Nabi: ఇవాళ సెప్టెంబర్ 16,2024 మహమ్మద్ ప్రవక్త జన్మదినంగా భావించే మీలాద్ ఉన్ నబి పండుగ. అల్లాహ్ తరువాత ముస్లింలు అత్యధికంగా గౌరవించేది మహమ్మద్ ప్రవక్తనే. అందుకే ఇస్లాంలో ఆయనకు అంత గౌరవం. ఆ ప్రవక్త అనుసరించిన జీవనశైలినే ముస్లింలు ఆచరిస్తుంటారు. ఇవాళ మీలాద్ ఉన్ నబి లేదా ఈద్ ఎ మీలాద్.
మీలాద్ ఉన్ నబి అందరూ జరుపుకోరా
ప్రవక్త మొహమ్మద్ జన్మదినాన్ని ముస్లింలు అందరూ జరుపుకోరు. కొందరే జరుపుకుంటారు. దీనికి కారణం లేకపోలేదు. ముస్లింలలో పుట్టినరోజు, వర్ధంతి వంటి కార్యక్రమాలు చేయకూడదని మహమ్మద్ ప్రవక్త సందేశముంది. మహమ్మద్ ప్రవక్తను తూచా తప్పకుండా ఆచరించేవాళ్లు పుట్టినరోజు వేడుకలు జరుపుకోరు. అదే విధంగా ఆయన పుట్టినరోజును కూడా జరపరు. ఇస్లాం ప్రకారం రెండే పర్వ దినాలు. ఒకటి రంజాన్. రెండవది బక్రీద్.
అయితే ముస్లింలలో కొంతమంది మహమ్మద్ ప్రవక్తపై భక్తితో మీలాద్ ఉన్ నబి పండుగగా ఆయన జన్మదినాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకుంటారు. ఇస్లామిక్ కేలండర్ ప్రకారం రబీ ఉల్ అవ్వల్ 12వ రోజు అంటే సెప్టెంబర్ 16న మహమ్మద్ ప్రవక్త పుట్టిన రోజును జరుపుకుంటారు. ఈ సందర్భాగం నగరంలో ప్రత్యేకంగా ఉరుస్ అంటే ర్యాలీ నిర్వహిస్తారు. అన్నదానాలు చేస్తారు. సహ పంక్తి భోజనాలు ఉంటాయి.
మీలాద్ ఉన్ నబి పండుగ పురస్కరించుకుని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సహా వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముస్లింలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.
Also read: Ganesh Visarjan: వినాయకుడి నిమజ్జనం ఎందుకు చేయాలి.. దీని వెనుక ఉన్న ఈ రహాస్యం ఏంటో మీకు తెలుసా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.