Medical Colleges Issue: ఏపీ ప్రభుత్వం వింత వైఖరి, మెడికల్ కాలేజీలు వద్దంటూ ఎన్ఎంసీకు లేఖ

Medical Colleges Issue: మెడికల్ కళాశాలల విషయంలో ఏపీ ప్రభుత్వం వైఖరి వివాదాస్పదంగా మారుతోంది. మెడికల్ సీట్లు ఇస్తామంటే ఈ ప్రభుత్వం వద్దంటోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా  సీట్లు వద్దంటూ లేఖ రాసివ్వడం ఆశ్చర్యం కల్గిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 11, 2024, 11:56 AM IST
Medical Colleges Issue: ఏపీ ప్రభుత్వం వింత వైఖరి, మెడికల్ కాలేజీలు వద్దంటూ ఎన్ఎంసీకు లేఖ

Medical Colleges Issue: ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వానికి ప్రైవేటు మోజు ఎక్కువగా ఉన్నట్టు కన్పిస్తోంది. పేద, మధ్య తరగతి విద్యార్ధుల వైద్య విద్యకు మోకాలడ్డుతోంది. మెడికల్ సీట్లు ఇస్తామంటే వద్దని చెబుతోంది. మెడికల్ కళాశాల నిర్వహణ తమ వల్ల కాదంటూ నేషనల్ మెడికల్ కమీషన్‌కు లేఖ రాయడం ఆరోపణలకు దారితీస్తోంది. 

తెలంగాణలో గత ప్రభుత్వం చేపట్టిన పనుల్ని ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా వరకు కొనసాగిస్తుంటే ఏపీలో మాత్రం మోకాలడ్డుతోంది. తెలంగాణలో నాలుగు మెడికల్ కళాశాలకు నేషనల్ మెడికల్ కమీషన్ అనుమతులు మంజూరు చేసింది. ఏపీలో కూడా మెడికల్ కళాశాలలకు అనుమతి ఇస్తుంటే కూటమి ప్రభుత్వం వద్దంటోంది. అంతేకాకుండా వద్దని లేఖ సైతం రాసిచ్చింది. ఈ విద్యా సంవత్సరం నుంచి వైఎస్సార్ జిల్లా పులివెందుల ప్రభుత్వ వైద్య కళాశాలకు అనుమతి ఇస్తూ 50 ఎంబీబీఎస్ సీట్లను కేటాయించింది నేషనల్ మెడికల్ కౌన్సిల్.  కానీ కళాశాల నిర్వహణ తమ వల్ల కాదని చేతులెత్తేసింది. అనుమతులు వెనక్కి తీసుకోవాలని ఎన్ఎంసీకు ఏకంగా లేఖ సైతం రాసిచ్చింది. 

గత విద్యా సంవత్సరంలో మచిలీపట్నం, విజయనగరం, ఏలూరు, నంద్యాల, రాజమండ్రిలలో 150 సీట్ల చొప్పున ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది పాడేరు, మార్కాపురం, ఆదోని, మదనపల్లె, పులివెందులలో ప్రారంభించాల్సి ఉంది. నేషనల్ మెడికల్ కౌన్సిల్ పులివెందుల కళాశాలకు 50 ఎంబీబీఎస్ సీట్లు కేటాయిస్తూ అనుమతులు మంజూరు చేస్తే ప్రభుత్వం వద్దని లేఖ రాసింది. రాష్ట్ర ప్రభుత్వమే విముఖత వ్యక్తం చేయడంతో చేసేది లేక రెండవ విడత కౌన్సిలింగ్‌కు పులివెందుల కళాశాలను తప్పించి పాడేరు కళాశాలకు సీట్ మ్యాట్రిక్స్‌లో ప్రకటించింది. 

ప్రభుత్వ వైద్య విద్యను కాకుండా గుజరాత్ తరహాలో పీపీపీ మోడల్‌లో ప్రైవేటు వ్యక్తులకు కొత్త వైద్య కళాశాలల్ని కట్టబెట్టేందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినట్టు తెలుస్తోంది. అందుకే జూన్ నెలలో ఎన్ఎంసీ తనిఖీలకు వస్తుందని తెలిసినా వసతులు సమకూర్చకుండా కాలయాపన చేసింది. వసతులు సమకూర్చి ఉంటే ప్రతి కళాశాలకు 150 సీట్ల చొప్పున అనుమతులు వచ్చుండేవి. కానీ అలా చేయడపోవడంతో 50 సీట్ల చొప్పున పాడేరు, పులివెందులకు అనుమతి లభించింది. పులివెందులకు ప్రభుత్వం అండర్ టేకింగ్ ఇవ్వకుండా సీట్లు వద్దని చెప్పింది. దాంతో ఆది కాస్తా ఆగిపోయింది. పాడేరు నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం ఉండటంతో 50 సీట్లతో అనుమతులు లభించాయి. 

Also read: Boats Removal: భారీ క్రేన్లతో బోట్ల తొలగింపు విఫలం, రేపట్నించి ప్లాన్ బి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News