సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన "పద్మావతి" సినిమా హైదరాబాద్లో విడుదల చేస్తే ఊరుకొనేది లేదని స్థానిక బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చరించారు. వీలైతే ఆందోళన కూడా చేస్తామని ప్రకటించారు. రాజస్థానీ సమాఖ్య సమావేశంలో మాట్లాడిన ఆయన, ఈ సినిమాని ప్రభుత్వం బహిష్కరించాలని డిమాండ్ చేశారు. బన్సాలీ తీసిన ఈ చిత్రంలో ఇసుమంతైనా నిజం లేదని.. కేవలమిది కట్టుకథ అని చెప్పారు. హిందూ యువతి పద్మావతి, అల్లావుద్దీన్ ఖిల్జీల మధ్య ప్రేమ సన్నివేశాలు చిత్రీకరించడానికి దర్శకుడికే ఎంత ధైర్యమని.. ఈ చిత్రాన్ని తప్పకుండా తాము అడ్డుకుంటామని తెలిపారు. ప్రస్తుతం ఈ సినిమాకు వ్యతిరేకంగా జైపూర్లో కూడా ఆందోళనలు కొనసాగుతున్నాయి. నవంబరు 10న ఈ చిత్రాన్ని బహిష్కరించడానికి భారీ ర్యాలీ నిర్వహించాలని భజరంగదళ్ పిలుపునిచ్చింది. అలాగే రాజస్థాన్లోని రాజ్ పుత్ సంఘాలు కూడా ఈ చిత్రంపై వ్యతిరేకతను చూపిస్తున్నాయి.