Andhra Pradesh Debts: పేరులో ముందు ఉండే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, సంక్షేమంలో మాత్రం వెనుకంజలో నిలుస్తోంది. కానీ అప్పుల్లో మాత్రం మొదటి స్థానం దిశగా పరుగులు పెడుతోంది. సంపద సృష్టిస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం కూడా భారీగా అప్పులు చేస్తుండడంతో అభివృద్ధిలో కాకుండా అప్పుల్లో నంబర్ వన్‌గా ఏపీ నిలిచే అవకాశం ఉంది. మూడు నెలల కాలంలోనే దాదాపు అర లక్ష కోట్లకు అప్పులు చేరాయి.
Also Read: Munneru Swimmng: మద్యంమత్తులో మున్నేరు నదిలో దూకిన యువకులు
విభజనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోటు బడ్జెట్లోకి వెళ్లింది. నాటి నుంచి ఆ లోటు బడ్జెట్ క్రమంగా పెరుగుతూనే ఉంది. కానీ, మిగులు బడ్జెట్ అనేది తీరని కలగా మారింది. 2014 నుంచి రాష్ట్రం తీరని అప్పుల్లో కూరుకుపోతోంది. నాడు ఐదేళ్లు.. మధ్యలో జగన్ ఐదేళ్లు పరిపాలించగా మళ్లీ ఇప్పుడు ఐదేళ్లు చంద్రబాబు నాయుడు పాలించనున్నాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు కూడా పూర్తవలేదు. కానీ అప్పులు మాత్రం అర లక్ష కోట్లకు చేరుకుంది. ఎన్నికల ప్రచారంలో జగన్ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి అప్పుల ఊబిలోకి నెట్టాడని నేడు అధికారంలో ఉన్న నాయకులు ప్రచారం చేశారు. కానీ వీళ్లు అధికారంలోకి వచ్చాక కూడా అదే ఒరవడిని కొనసాగిస్తున్నారు.
Also Read: AP Floods: ఆంధ్రప్రదేశ్‌కు అండగా 'డబ్బులు ఊరికే రావు' గుండు అంకుల్.. భారీ విరాళం
వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమ పథకాలకు భారీగా ఖర్చు చేశారు. తిరిగి ఆదాయం వచ్చే మార్గాలు చేపట్టకపోవడం.. ప్రభుత్వం నుంచి పైసా పోవడమే తప్ప తిరిగి రావడమనేది నాటి ఐదేళ్లు జరగలేదు. అంతకుముందు 2014-19 మధ్య ఉన్న చంద్రబాబు కూడా ఇదే రీతిన కొనసాగించాడు. విచ్చలవిడిగా ఖర్చులు చేసి అప్పుల గుదిబండను జగన్‌కు ఇవ్వగా.. జగన్ దాన్ని రెట్టింపు చేశాడు.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నెత్తిపై అప్పుల అనకొండ ఉంది. ఇటీవల అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అప్పుల మీద అప్పులు చేస్తోంది. ఎన్నికల ప్రచారంలో భారీగా సంక్షేమ పథకాలు ప్రకటించారు. వాటికి ఖర్చు తడిసి మోపడవుతుంది. అయితే పథకాలు ఇంకా అమల్లోకి రాకముందే అప్పులు రూ.43 వేల కోట్లకు చేరాయి. కేవలం నాలుగు నెలల్లోనే ఇంతటి అప్పు చేయడం అందరినీ విస్మయానికి గురి చేసింది.
వచ్చే ఆదాయం కన్నా ఖర్చులు రెట్టింపు స్థాయిలో ఉండడంతో ఆర్థిక లోటు పెరుగుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఇప్పటివరకు ఒక్క పింఛన్ల పెంపు తప్ప మిగతా ఏ పథకం అమలు చేయలేదు. ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదు. కానీ ఆదాయం మాత్రం నీళ్లలా ఖర్చవుతోంది. కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తున్న చంద్రబాబు అన్ని మార్గాల ద్వారా అప్పులు పుట్టిస్తున్నాడు. కానీ తీర్చే మార్గం మాత్రం ఇప్పటివరకు చేయలేదు. ఇదే విషయాన్ని వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి ప్రస్తావించారు. ట్విటర్ వేదికగా కూటమి ప్రభుత్వం చేసిన అప్పుల చిట్టా విప్పారు.
ఆదాయం కన్నా ఖర్చు రెట్టింపు
'చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేయకుండానే కేవలం మూడు నెలల్లోనే రూ.43,000 కోట్ల అప్పులు చేసింది. వీరి పాలనలో పన్నులు, ఇతర ఆదాయ మార్గాల ద్వారా రూ.44,822 కోట్ల ఆదాయం వస్తే.. ఖర్చులు మాత్రం రూ.87282 కోట్లు ఉంది. ఆర్థిక లోటు 83.92 శాతానికి చేరుకుంది.
సంపద సృష్టిస్తామని అని చెప్పిన చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని మరింత అప్పుల పాలు చేయడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. అయితే అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో పరిస్థితులు సక్రమంగా లేవు. తాజాగా వరదలు కూడా ఏపీకి తీరని కష్టాల్లోకి నెట్టింది. ప్రస్తుత అప్పులు ఇలా ఉంటే వచ్చే ఐదేళ్లల్లో ఇంకెన్ని అప్పులు పెరుగుతాయోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే రీతిన అప్పులు కొనసాగితే ఏడాదికి రూ.లక్ష కోట్ల చొప్పున ఐదేళ్లకు రూ.ఐదు లక్షల కోట్లు అప్పులు చేరే అవకాశం ఉంది.
ఎదురుదాడి
సంపద సృష్టిస్తామని చెప్పిన ప్రభుత్వం గతంలో కంటే అధికంగా అప్పులు చేయడం ఏమిటని వైఎస్సార్సీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. అప్పులు భారీగా చేస్తుండడంపై విమర్శలు వస్తుండడంతో కూటమి నాయకులు ఎదురుదాడి చేయడం ప్రారంభిస్తున్నారు. ఐదేళ్లు జగన్ చేసిన అప్పులకే మిత్తి కట్టాల్సి వస్తోందని చెబుతున్నారు. ఉన్న ఆదాయాన్ని దోచేసుకుని రాష్ట్రం దివాళా తీసే పరిస్థితుల్లో అప్పులు చేయకుండా ఏం చేస్తారని కూటమి అధికార టీడీపీ నాయకులు ఎదురు ప్రశ్నిస్తున్నారు.
(1/3) In just three months, under the leadership of Sri Chandrababu Naidu (@ncbn), the Andhra Pradesh government has taken on over ₹43,000 crore in debt without implementing any significant either development project or welfare schemes. Due to the heavy borrowing, the state's…
— Vijayasai Reddy V (@VSReddy_MP) September 10, 2024
(2/3) During this period, Andhra Pradesh generated ₹44,822 crore from taxes and other revenue sources, yet it still wasn't sufficient to cover the state's expenses. Expenditures soared to ₹87,282 crore, forcing the state to rely on loans to bridge the ₹40,234 crore deficit—a…
— Vijayasai Reddy V (@VSReddy_MP) September 10, 2024
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter