ఢిల్లీ: త్రిపుల్ తలాక్ బిల్లుపై రాజసభ్యలో వాడీ వేడీ చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా ఈ బిల్లుపై ఆయా పార్టీలు తమ తమ వైఖరిని తెలియజేస్తున్నాయి. అ సందర్భంలో వైసీపీ కూడా తన వైఖరి స్పష్టం చేసింది. ఈ బిల్లులో అంశాలు సరిగాలేవని అభ్యంతరం వ్యక్తం చేస్తూ తమ పార్టీ త్రిపుల్ తలాక్ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.
వైసీపీ అభ్యంతరాలు ఇవే..
కేంద్రం ప్రతిపాదిస్తున్న ఈ బిల్లులో తలాక్ చెప్పిన భర్తకు మూడేళ్లు జైలు శిక్ష విధించడం అతనికున్న చట్టబద్ధమైన హక్కుకు వ్యతిరేమని విజయసారెడ్డి అభిప్రాయపడ్డారు. అలాగే ఈ వ్యవహరంలో మూడేళ్ల పాటు జైలుకు పంపడం వల్ల భర్తకు పునరాలోచించే అవకాశం లేకుండా పోతుందన్నారు. సరే ఈ కాలంలో భార్యకు ఏ విధంగా జీవనభృతి అందించగలడని విజయసారెడ్డి ప్రశ్నించారు.
ఇది ఒక సామాజిక సమస్య...
సామాజిక సమస్య అయిన ట్రిపుల్ తలాక్‌ను నేరపూరితంగా మార్చడం వల్ల పరిష్కారం లభించదని విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు. తమ అభ్యంతరాలను పరిగణనలోకి తీసకొని ఈ బిల్లును పునఃపరిశీలించాలని కేంద్రాన్ని కోరుతున్నామన్నారు. అయితే బిల్లును యథతథంగా ఆమోదించాలనుకుంటే మాత్రం తాము కచ్చితంగా త్రిపుల్ తలాక్ బిల్లుకు తాము వ్యతిరేకిస్తామని... వ్యతిరేకంగా ఓటు వేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఖరిని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు