AP Heavy Rains: బంగాళాఖాతంలో ఏర్పడనున్న వాయుగుండంం ముప్పు తెలుగు రాష్ట్రాలకు తప్పింది. పశ్చిమ మద్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండమై ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరానికి చేరుకోనుంది. కానీ కోస్తాంధ్రలో మాత్రం ఇవాళ్టి నుంచి ఈ నెల 8వ తేదీ వరకు భారీ వర్షాలు పడనున్నాయి.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాతీరంలో నిన్న అల్పపీడనమైంది. ఈ అల్ప పీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతోంది. ఈ అల్పపీడనం రానున్న రెండు రోజుల్లో మరింతగా బలపడనుంది. వాయుగుండంగా మారినా ఒరిస్సా తీరం వైపుకు వెళ్లనుందని వాతావరణ శాఖ తెలిపింది. అటు వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన రుతు పవన ద్రోణి కూడా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉంది. దాంతో ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో ఇవాళ్టి నుంచి భారీ వర్షాలు పడనున్నాయి.
ముఖ్యంగా అనంతపుపరం, సత్యసాయి, కడప, అన్నమయ్య, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయి. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కాకినాడ జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. తీరం వెంబడి గంటకు 55 కిలోమీటర్ల వేగం వరకు గాలులు వీయనున్నాయి.
అల్పపీడనం రెండు రోజుల్లో బలపడి వాయుగుండంగా మారి ఒడిశా వైపుకు కదలవచ్చని ఐఎండీ తెలిపింది. కానీ ఈ ప్రభావంతో కోస్తాంధ్ర, ఉత్తర కోస్తా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు తప్పేట్టు లేవు.
Also read: No Hidden Camera: ఇది నిజం.. గుడ్లవల్లేరు గర్ల్స్ హాస్టల్లో రహాస్య కెమెరాలు లేవు: పోలీస్ శాఖ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.