Diabetes Symptoms in Telugu: ఇటీవలి కాలంలో మధుమేహం ప్రదాన సమస్యగా మారుతోంది. ప్రతి పదిమందిలో ఆరుగురికి తప్పకుండా డయాబెటిస్ ఉంటోంది. శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోతుంటాయి. సకాలంలో గుర్తించి నియంత్రించలేకపోతే తీవ్ర పరిణామాలు ఎదురుకావచ్చు.
Diabetes Symptoms in Telugu: సాధారణంగా డయాబెటిస్ ఉంటే చాలా రకాల లక్షణాలు బయటపడుతుంటాయి. అయితే డయాబెటిస్ ప్రారంభ లక్షణాలు కళ్లలో కూడా కన్పిస్తాయని చాలామందికి తెలియదు. కళ్లలో కన్పించే కొన్ని మార్పులు డయాబెటిస్ ప్రారంభ లక్షణాలుగా ఉంటాయి. వీటిని నిర్లక్ష్యం చేయకుండా వైద్యుని సంప్రదిస్తే మంచిది
రాత్రి పూట సరిగ్గా కన్పించకపోవడం రాత్రి సమయంలో కంటి చూపులో సమస్య ఉంటే అంటే సరిగ్గా కన్పించకుంటే డయాబెటిస్ ప్రారంభ లక్షణం కావచ్చు. ఎందుకంటే డయాబెటిస్ ప్రభావం ముందుగా పడేది కంటి నరాలపైనే. కంటి చూపు మందగిస్తుంది. రాత్రి సమయంలో సమస్యలు ఎదురైతే డయాబెటిస్ అనుమానించాల్సి వస్తుంది
కళ్లలో స్వెల్లింగ్ డయాబెటిస్ ఉంటే కళ్లకు నలువైపులా స్వెల్లింగ్ ఉంటుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ అధికంగా ఉన్నప్పుడు ఈ పరిస్థితి గమనించవచ్చు. ఈ లక్షణాలు కన్పిస్తే తేలిగ్గా తీసుకోవద్దు. వెంటనే వైద్యుని సంప్రదించాలి
కళ్లలో నొప్పి, ఒత్తిడి డయాబెటిస్ ఉంటే కంటి నరాలపై ప్రభావం పడుతుంది. దాంతో కళ్లలో నొప్పి లేదా ఒత్తిడిగా అన్పించవచ్చు. కంటి లోపల ఏదైనా నొప్పిగా అన్పిస్తే వెంటనే అప్రమత్తం అవాలి. సకాలంలో చికిత్స చేయించకపోతే పరిస్థితి ప్రతికూలం కావచ్చు
మసకగా కన్పించడం మీ కళ్లు మసకగా కన్పిస్తున్నా లేక కంటి చూపులో మార్పు కన్పిస్తున్నా తేలిగ్గా తీసుకోవద్దు. డయాబెటిస్ ప్రారంభంలోఇదే పరిస్థితి ఉండవచ్చు. మీక్కూడా ఇలా కన్పిస్తే వెంటనే వైద్యుని సంప్రదించి బ్లడ్ షుగర్ టెస్ట్ చేయించుకోవాలి.
కంటి చూపులో మార్పు డయాబెటిస్ కారణంగా కంటి చూపులో ఒకేసారి మార్పు రావచ్చు. ఈ మార్పు ఎక్కువగా ఉండవచ్చు. కంటి చూపులో మార్పు కన్పిస్తే అది డయాబెటిస్ ప్రారంభ లక్షణంలో ఒకటి. వెంటనే అప్రమత్తమై వైద్యుని సంప్రదించాలి.