Jio SIM: జియో సిమ్‌ ఇంట్లోనే ఇలా సింపుల్‌గా యాక్టివేట్‌ చేసుకోండి.. వివరాలు మీకోసం..

Jio SIM Activate: జియో కొత్త ఆఫర్లతో ముందుకు వస్తోంది. వివిధ రీఛార్జీ ప్లాన్‌లతో కస్టమర్లను ఆకట్టుకుంటోంది. అయితే, కొత్తగా జియో సిమ్‌ తీసుకున్నవారు ఇంట్లో నుంచే ఎలా యాక్టివేట్‌ చేసుకోవాలో తెలుసుకుందాం. ఇది రెండూ ఫిజికల్‌ సిమ్‌, ఇసిమ్‌ రెండు విధాలుగా ఉపయోగపడుతుంది.
 

1 /5

జియో ఐయాక్టివేట్‌ సర్వీసును ప్రారంభించింది ఇది మిలియన్ల మంది జియో యూజర్లకు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ఐయాక్టివేట్‌ వల్ల సిమ్‌ కార్డును ఇంట్లో నుంచే ఈజీగా యాక్టివేట్‌ చేసుకోవచ్చు.  దీంతో వినియోగదారులు జియో స్టోర్‌కు వెళ్లాల్సిన అవసరం ఉండదు. అంతేకాదు జియో ఉచిత సిమ్‌ కార్డుల డెలివరీ కూడా చేస్తుంది. ఇది మరింత సులభతరం అవుతుంది. ఈజీగా సిమ్‌ కార్డు తీసుకుని ఇంట్లోనే సిమ్‌ యాక్టివేట్‌ చేసుకోవచ్చు.  

2 /5

ఈ ఐయాక్టివేట్‌ రెండూ ఐఓఎస్‌, ఆండ్రాయిడ్‌ కస్టమర్లకు అందుబాటులో ఉంది. ఈ సర్వీస్‌ వినియోగించడానికి ముందుగా మై జియో యాప్‌ మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. ఆ తర్వాత వెంటనే మీరు ఐయాక్టివేట్‌ ప్రాసెస్‌ మొదలువుతుంది.  

3 /5

జియో ఐయాక్టివేట్‌  చేసుకునే విధానం.. ముందుగా మై జియో యాప్‌ ఓపెన్‌ చేయాలి. ఆ తర్వాత హోం పేజీలోని ఐయాక్టివేట్‌ బ్యానర్‌ కింద ఉంటుంది. దాన్ని క్లిక్‌ చేయాలి. అప్పుడు సిమ్‌ కార్డు ఫ్రీహోం డెలివరీ పేజీకి తీసుకువెళ్తుంది. అందులో మొబైల్‌ నంబర్‌, ఓటీపీ నమోదు చేయాలి.

4 /5

ఆ తర్వాత మీ కొత్త నంబర్‌కు సిమ్‌ టైప్‌ కూడా ఎంచుకోవాలి. అక్కడ ఇసిమ్‌ లేదా ఫిజికల్‌ సిమ్‌ రెండిటిలో ఏదో ఒకటి ఎంచుకోండి. సిమ్‌ సెలక్ట్‌ చేసుకున్న తర్వాత జియో ఐయాక్టివేట్‌ ఆప్షన్‌పై క్లికి్‌ చేయాలి. ఇక్కడ మీరు కేవైసీ ఆధార్‌ ఓటీపీ లేదా కేవైసీ డిజిలాకర్ రెండిటిలో ఒకటి ఎంచుకోవాలి.

5 /5

స్క్రీన్‌ సూచనల మేరకు మీ వివరాలను నమోదు చేయాలి. వెంటనే సిమ్‌ యాక్టివేట్‌ అయిపోతుంది. 47వ జనరల్‌ మీటింగ్‌ ఉత్సవాల్లో జియో ఫోన్‌కాల్‌ ఏఐ ను పరిచయం చేయనున్నట్లు తెలిపింది. ఇది మిలియన్ల జియో వినియోగదారులకు విప్లవాత్మక సర్వీసులకు శ్రీకారం చుట్టింది.  ఈ ఫీచర్ తో కాల్‌ రికార్డ్, ట్రాన్ల్సేట్‌ ఏ భాషలోకి అయినా చేసుకోవచ్చు. ఇది టెక్ట్స్ రూపమైనా, వాయిస్‌ అయినా సులభంగా తర్జుమా చేసేస్తుంది.