Help To Vijayawada Flood Victims Follow These Process To Pay Donation AP CMRF: భారీ వర్షాలతో ఆంధ్రప్రదేశ్ అతలాతకుతలమైంది. నిరాశ్రయులుగా మిగిలిన విజయవాడ ప్రజలకు మీ వంతు సహాయం చేద్దామనుకుంటున్నారా? వరద బాధితులకు విరాళాలు ఇచ్చేవారి కోసం ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వానికి విరాళం అందించాలంటే ఈ ప్రక్రియ పాటించండి.
Donation To AP CMRF: ఆంధ్రప్రదేశ్లో విజయవాడ పరిస్థితి దయనీయంగా మారింది. ప్రజలు తీవ్ర నిరాశ్రయులయ్యారు.
Donation To AP CMRF: వరదలు మిగిల్చిన విషాదంతో బెజవాడ ప్రజలు కట్టుబట్టలతో బయటపడ్డారు.
Donation To AP CMRF: బట్టలు, ఆస్తి, డబ్బు మొత్తం కోల్పోయి దీనావస్థలో ఉన్న ప్రజలను ఆదుకోండి. ప్రభుత్వానికి పెద్ద ఎత్తున విరాళాలు పొందితే ప్రభుత్వం నుంచి కొన్ని సార్లు పన్ను మినహాయింపు పొందే అవకాశం కూడా ఉంది.
Donation To AP CMRF: ఏపీ ప్రజలను ఆదుకోవడానికి ప్రభుత్వం విరాళాలు ఆహ్వానిస్తోంది. మీరు నేరుగా సహాయం అందించే అవకాశం ఉండదు. ప్రభుత్వానికి మీకు తోచినంత పంపితే బాధితులకు అండగా ఉంటుంది.
Donation To AP CMRF: వరద బాధితుల కోసం కొన్ని ఫేక్ కూడా ఉంటాయి. అందుకే ప్రభుత్వం నేరుగా ప్రజలకు ఆన్లైన్ వివరాలు పంచుకుంది. వీటి ద్వారానే చెల్లింపులు చేయాల్సి ఉంటుంది.
Donation To AP CMRF: సీఎం సహాయ నిధికి ఆన్ లైన్లో విరాళాలు పంపించవచ్చు. బ్యాంక్ ఖాతాల ద్వారా.. యూపీఐ పేమెంట్ల ద్వారా కూడా విరాళం అందించవచ్చు.
Donation To AP CMRF: బ్యాంకు ఖాతాల ద్వారా...: ఎస్బీఐ అకౌంట్ నంబర్ 38588079208. వెలగపూడి బ్రాంచ్. ఐఎఫ్ఎస్సీ కోడ్ ఎస్బీఐఎన్0018884. మరో బ్యాంక్ ఖాతా. ఎస్బీఐ అకౌంట్ నంబర్: 3689718069. ఎంజీ రోడ్డు విజయవాడ బ్రాంచ్. ఐఎఫ్ఎస్సీ కోడ్ ఎస్బీఐఎన్0016857
Donation To AP CMRF: యూపీఐ పేమెంట్ల ద్వారా చేయాలనుకున్న వారు బ్యాంక్ ఖాతా వివరాలు పొందుపర్చి పంపించే అవకాశం ఉంది. అంతేకాకుండా క్యూఆర్ కోడ్ ద్వారా కూడా యూపీఐ పేమెంట్ (ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం తదితర) ద్వారా విరాళాలు అందించవచ్చు.