Sebi officials complain of toxic work culture: మార్కెట్ రెగ్యులేటర్ సెబీ చీఫ్ మాధబి పూరీ బుచ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. తాజాగా ఆమె తన తోటి ఉద్యోగులతో దురుసుగా ప్రవర్తిస్తున్నారని, దూషణ పదజాలం వాడుతున్నారని..టాక్సిక్ వర్క్ కల్చర్ ప్రోత్సహిస్తున్నారని ఆర్థిక మంత్రిత్వ శాఖకు సెబి ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె పని తీరుపై మరోసారి వివాదం చెలరేగింది.
వివిధ వార్తా సంస్థల కథనం ప్రకారం సెబీ చైర్‌పర్సన్‌పై సెబీ అధికారులే ఈ ఆరోపణలు చేశారు. రెగ్యులేటర్ చీఫ్ మాధబీ పూరీ బుచ్ ప్రవర్తనపై సెబీ అధికారులు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారని , ఆమె ఆఫీసులోని పని వాతావరణాన్నిపాడుచేస్తోందని ఆరోపించారు. సెబీ అధికారులు గత నెలలో ఆర్థిక మంత్రిత్వ శాఖకు ఈ ఫిర్యాదు చేశారు.
ఉద్యోగులతో దురుసు ప్రవర్తన:
సెబీ అధికారులు తమ ఫిర్యాదులను తెలియజేస్తూ ఆర్థిక మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. మాధబి పూరి విషపూరితమైన పని సంస్కృతిని (టాక్సిక్ వర్క్ కల్చర్ ) ప్రోత్సహిస్తున్నారని ఫిర్యాదు లేఖలో తెలిపారు. ఉద్యోగులను అందరి ముందు కించపరచడం సర్వసాధారణమైపోయిందని ఈ లేఖలో ప్రధానంగా ప్రస్తావించారు.
ఇదిలా ఉంటే మాదాబి పూరి బుచ్ గత నెల రోజులుగా వివాదాల్లోనే ఉన్నారు. ఇప్పటికే మదాబీ పూరీకి, ఆమె భర్తకు అదానీ గ్రూప్‌తో వాణిజ్య సంబంధాలు ఉన్నాయని అమెరికన్ షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ వెల్లడించి ఆమె పేరును మొదట బయటకు తెచ్చింది.
Also Read : Post Office RD Scheme: పోస్ట్ ఆఫీస్ లోని ఈ స్కీంలో మీరు డబ్బు దాచుకుంటే రూ. 8 లక్షలు మీ సొంతం.. ఎలాగంటే
తాజా వివాదం గురించి మాట్లాడుకుంటే సెబీ అధికారులు ఆగస్టు 6న ఆర్థిక మంత్రిత్వ శాఖకు పంపిన లేఖను చూసినట్లు ప్రముఖ బిజినెస్ వెబ్ పోర్టల్ ఒకటి పేర్కొంది. సెబీ చీఫ్ పని వాతావరణాన్ని పాడు చేశారని అందులో ఆరోపించారు. దీనికి సంబంధించి సెబీని కొందరు జర్నలిస్టులు సంప్రదించగా, ఉద్యోగుల సమస్యను సెబీ ఇప్పటికే పరిష్కరించిందని ఇమెయిల్ ద్వారా తెలియజేసింది.
అయితే కేంద్ర మంత్రిత్వ శాఖకు పంపిన ఫిర్యాదు లేఖలో దాదాపు 500 మంది సెబీ ఉద్యోగుల సంతకాలు ఉన్నాయి. కాగా సెబీలో ఉద్యోగుల సంఖ్య దాదాపు ఒక వెయ్యి మంది ఉన్నారు. ఇదిలా ఉంటే మాజీ ఆర్థిక కార్యదర్శి ఎస్‌సి గార్గ్ గత నెల జీ బిజినెస్‌తో మాట్లాడుతూ, హిండెన్ బర్గ్ ఆరోపణల నేపథ్యంలో దేశ మార్కెట్ రెగ్యులేటర్ చీఫ్ వచ్చిన ఆరోపణలు "ప్రతిష్టకు మంచివి కావు" కాబట్టి, బుచ్ పదవీవిరమణ చేయాలని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని నిశితంగా పరిశీలించాలని ఆయన కోరారు.
Also Read : GOld Rate Today: స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. ఈరోజు బంగారం ధర ఎలా ఉందంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.