Heavy To Very Heavy Rainfall: అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణలోనూ కుండపోత వర్షాలు పడుతున్నాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. శనివారం మొత్తం ఎడతెరపి లేకుండా వర్షం కురవడంతో తెలంగాణ మొత్తం తడిసి ముద్దయ్యింది. అయితే రానున్న మూడు రోజులు కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఆది, సోమ, మంగళవారాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.
Also Read: Tragedy Incident: టీచర్స్ డే ముందే విషాదం.. విద్యార్థుల ప్రాణాలు కాపాడుతూ టీచర్ జల సమాధి
మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్ప పీడనం వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో మూడు రోజులు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో తెలంగాణకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. దక్షిణ తెలంగాణకు భారీ వర్షం ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది. గంటలకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.
Also Read: Trains Cancelled: కుండపోత వర్షాలు.. ఆంధ్రపదేశ్‌లో భారీగా రైళ్లు రద్దు
అతి భారీ వర్షాలు
నల్లగొండ, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల, నారాయణపేట జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
భారీ వర్షాలు
జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట జిల్లాతోపాటు ఇతర జిల్లాలు
కడెం ప్రాజెక్టు ఉధృతి
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు కడెం ప్రాజెక్టుకు వరద భారీగా వసతోంది. దీంతో అప్రమత్తమైన ప్రాజెక్టు అధికారులు ఐదు గేట్లు ఎత్తారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 698.550 అడుగుల వద్ద వరద కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో 13,318 క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో 27,296 క్యూసెక్కులు.
సూర్యాపేట జిల్లాకు ఆరెంజ్ అలర్ట్
భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో సూర్యాపేట జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రజల సహాయార్థం కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేసింది. వర్షాలతో ఇబ్బందులు పడుతున్న వారు ఎలాంటి సహాయం కావాలన్నా ఫోన్ నంబర్ 6281492368లో సంప్రదించాలని అధికారులు సూచించారు. సిబ్బంది 24 గంటల పాటు అందుబాటులో ఉంటారు.
ఖమ్మం జిల్లాలో..
అల్పపీడనం ప్రభావంతో ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో కుండపోత వర్షం పడుతోంది. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. ఎడతెరిపి లేని వర్షానికి వాగులు, వంకలు పొంగి గ్రామాలకు రాకపోకలకు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఎర్రూపాలెం మండలం నరసింహపురం లో బైక్‌పై వాగు దాటుతూ కొట్టుకుపోయి చెట్టును పట్టుకుని ప్రాణాలు కాపాడుకున్నాడు. స్థానికులు మోకు సాయంతో ఒడ్డుకు చేర్చారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter