NTR Bharosa Pension Scheme: ఎన్నికల్లో సంచలన విజయం సాధించి అధికారంలోకి వచ్చిన తెలుగు దేశం నేతృత్వంలోని కూటమి సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే దేశంలో ఎక్కడా లేనట్టు పింఛన్లు పెంచి ఇస్తుండగా తాజాగా ఆ పింఛన్ల పంపిణీ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు వేతనం కన్నా ముందే లబ్ధిదారులకు పింఛను అందించాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే నెల చివరి రోజు పింఛన్లు అందించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
Also Read: Chandrababu: ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు అసహనం.. మీ వలన పరువు పోతుంది!
ఆంధ్రప్రదేశ్ లో ఒక రోజు ముందుగానే పెన్షన్లు లబ్ధిదారులకు అందనున్నాయి. సెప్టెంబర్ నెలకు సంబంధించి పింఛన్ ను ఈ నెల చివరి రోజు అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే పింఛన్ పంపిణీకి సంబంధిత అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమైంది. అయితే ఒకరోజు ముందే పింఛను ఇవ్వడానికి కారణమేంటో తెలుసా? సెప్టెంబర్ 1వ తేదీ ఆదివారం రావడమే !
Also Read: Big Shock To YSRCP: జగన్‌కు షాక్‌ల మీద షాక్.. ఎమ్మెల్సీ పోతుల సునీత రాజీనామా
సెలవు రోజు కావడంతో
సాధారణంగా ఏపీ ప్రభుత్వం పింఛన్లు పంపిణీ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మాదిరిగా కూటమి ప్రభుత్వం కూడా అదే పద్ధతిని కొనసాగిస్తోంది. లబ్ధిదారులకు పింఛను ఠంచనుగా అందించేందుకు ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యం ఇస్తోంది. అయితే సెప్టెంబర్ 1వ తేదీన పింఛను పంపిణీ చేయడానికి ఆదివారం అడ్డు వచ్చింది. ప్రభుత్వ సిబ్బంది సెలవులో ఉంటారు. కనుక ఫించన్ పంపిణీకి అవాంతరం ఏర్పడతుందనే భావనతో ఏపీ ప్రభుత్వం ఒకరోజు ముందుకు జరిపింది.
వంద శాతం లక్ష్యం..
ఈ నేపథ్యంలోనే పింఛన్ ముందే అందించనున్నారు. అయితే 31వ తేదీన పింఛన్ అందకపోతే సెప్టెంబర్ 2వ తేదీన అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విజయవంతంగా రెండు సార్లు పింఛన్ పూర్తి చేయగా.. మూడో పింఛన్‌ను కూడా అంతే విజయవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. వీలైనంతగా ఒక్కరోజే వంద శాతం పింఛన్ పంపిణీ పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగనుంది. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితో సహా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు దగ్గరుండి పింఛన్ పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. లబ్ధిదారులు రూ.4 వేల పింఛన్ పొందుతున్న విషయం తెలిసిందే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook