MLC Pothula Sunitha Resign: అధికారం కోల్పోయిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంక్షోభంలోకి వెళ్తున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే మున్సిపాలిటీలన్నీ చేజారుతున్నాయి. క్షేత్రస్థాయిలో నాయకులు పార్టీలు మారుతుండడంతో తాజాగా సీనియర్ నాయకులు కూడా పార్టీ మారుతున్నారు. రాజ్యసభ సభ్యులంతా మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమవుతున్న వేళ మరో భారీ షాక్ తగిలింది. ఎమ్మెల్సీ పోతుల సునీత రాజీనామా చేశారు. పార్టీని వీడుతూ రాజీనామా పత్రాన్ని మాజీ సీఎం వైఎస్ జగన్‌కు పంపించారు. రాజీనామా చేసిన ఆమె అధికార టీడీపీలో చేరనున్నట్లు సమాచారం.
Also Read: Chandrababu: ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు అసహనం.. మీ వలన పరువు పోతుంది!
అధికారం కోల్పోయిన నేపథ్యంలో ఎమ్మెల్సీ పోతుల సునీత వైఎస్సార్‌సీపీని వీడారు. తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయ జీవితం మొదలుపెట్టిన ఆమె 2014 ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అక్కడ స్వతంత్ర అభ్యర్థి ఆమంచి కృష్ణ మోహన్ చేతిలో ఆమె పరాజయం పొందారు. ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో పోతుల సునీతకు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు.
Also Read: YS Jagan: ఆంధ్రప్రదేశ్‌కు ఉరితాడు బిగిస్తారా సీఎం గారు? చంద్రబాబుపై వైఎస్ జగన్ ఆగ్రహం
అయితే 2019 ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేయలనుకున్నా అవకాశం లభించలేదు. టీడీపీ తరపున కరణం బలరాం పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలవగా టీడీపీ అధికారంలోకి రాలేదు. దీంతో ఎమ్మెల్యే కరణం బలరాంతో కలిసి ఎమ్మెల్సీ పోతుల సునీత టీడీపీకి రాజీనామా చేశారు. వారిద్దరూ కలిసి వైసీపీలో చేరారు. పార్టీలో చేరిన సునీతకు సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ ఆమె పార్టీని వీడారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర ఓటమి పాలవడంతో అప్పటి నుంచి ఆమె పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. తాజా రాజీనామాతో ఆమె వ్యవహార శైలి కేవలం అధికారం ఉన్న పార్టీలోనే ఉండేటట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండడంతో మరోసారి పచ్చ కండువా కప్పుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook