TGSRTC: ఆ చిన్నారికి లైఫ్ టైమ్ ఫ్రీ బస్ పాస్.. పురుడు పోసిన స్టార్ నర్సుకు మరో బంపర్ ఆఫర్..డిటెయిల్స్ ఇవే..

Raksha bandhan 2024:  రాఖీ పండగ రోజున బస్సులో జన్మించిన చిన్నారిపై తెలంగాణ ఆర్టీసీ వరాల జల్లు కురిపించింది. ఈ మేరకు బస్ భవన్ లో కండక్టర్, డ్రైవర్ లతో పాటు,పురుడు పోసిన నర్సును బస్ భవన్ లో ఆర్టీసీ అధికారులు ఘనంగా సన్మానించారు.  

Written by - Inamdar Paresh | Last Updated : Aug 20, 2024, 08:29 PM IST
  • బస్సులో పుట్టి బంపర్ ఆఫర్ కొట్టేసిన చిన్నారి..
  • పురుడు పోసిన వారికి ఘనంగా సన్మానం..
TGSRTC: ఆ చిన్నారికి లైఫ్ టైమ్ ఫ్రీ బస్ పాస్.. పురుడు పోసిన స్టార్ నర్సుకు మరో బంపర్ ఆఫర్..డిటెయిల్స్ ఇవే..

TGRTC MD Sajjanar bumper offer life time free bus pass for a child who born in bus: తెలంగాణ ఆర్టీసీలో ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలకు ఉచిత బస్సుప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు. మహిళలు కూడా ఈ పథకంను ఎంతో ఉపయోగించుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. రాఖీ పౌర్ణమి రోజున తన సోదరుడికి ఒక ఇల్లాలు.. రాఖీ కట్టేందుకు వెళ్తుంది. ఆమె నిండు గర్భవతిగా ఉన్న కూడా.. తన సోదరుడికి రాఖీ కట్టాలని ఉద్దేష్యంతో బస్సులోప్రయాణిస్తుంది. ఈ ఘటన గద్వాల డిపోకు చెందిన బస్సులో జరిగింది.

మహిళ బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు ఒక్కసారిగా ఆమెకు పురిటినొప్పులు వచ్చాయి. దీంతో బస్సు, కండక్టర్ చాకచక్యంగా వ్యవహరించారు. అదే బస్సులో.. ఉన్న స్టాఫ్ నర్సు సైతం.. మహిళకు సపర్యలు చేసి.. జాగ్రత్తగా డెలీవరీ చేశారు.పండంటి చిన్నారికి మహిళ జన్మనిచ్చింది. దీంతో బస్సులో డ్రైవర్, కండక్టర్ వ్యవహరించిన తీరు.. నర్సు కూడా వారికి సహాయంగా డెలీవరీ చేయడంతో తల్లి, బిడ్డా ఇద్దరు కూడా ప్రస్తుతం ఆరోగ్యంగా ఆస్పత్రిలో ఉన్నారు. ఇదిలా ఉండగా.. ఈరోజు ఆర్టీసీ అధికారులు పురుడు పోసిన డ్రైవర్ , కండక్టర్ , స్టాఫ్ నర్సులను హైదరాబాద్ లోని బస్ భనన్ కు ఆహ్వానించారు. అంతేకాకుండా.. వారిని ఘనంగా సన్మానించారు. 

బస్సులో.. పురుడు పోసుకున్న చిన్నారికి టీజీఎస్ ఆర్టీసీ లైఫ్ టైం ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణించే ఆఫర్ ప్రకటించింది. అదే విధంగా.. డెలివరీకి సహాయ పడిన నర్సుకు కూడా.. లగ్జరీ, సూపర్ లగ్జరీ బస్సుల్లోనూ ఉచితంగా ప్రయాణించే సౌకర్యాన్ని ఆర్టీసీ కల్పించింది. ఆర్టీసీ బస్సులు, బస్ స్టేషన్‌లలో పుట్టిన పిల్లలకు జీవిత కాలపు ఉచిత బస్ పాస్‌ను ఇవ్వాలని గతంలో యాజమాన్యం తీసుకున్న నిర్ణయం తెలిసిందే. ఈ ఆడపిల్లకు బర్త్ డే గిఫ్ట్‌గా లైఫ్ టైం ఫ్రీ బస్ పాస్‌ను మంజూరు చేస్తున్నట్లు వెల్లడించింది. అలాగే.. కండ‌క్టర్‌తో పాటు డెలివ‌రీకి సాయం చేసిన వ‌న‌ప‌ర్తిలోని మ‌ద‌ర్ అండ్ చైల్డ్ గ‌వ‌ర్నమెంట్ హాస్పట‌ల్ స్టాఫ్ న‌ర్స్ అలివేలు మంగ‌మ్మకు డీల‌క్స్, సూప‌ర్ ల‌గ్జరీ స‌ర్వీసుల్లోనూ ఏడాది పాటు ఉచితంగా ప్రయాణించే బ‌స్ పాస్‌ను సంస్థ అందించింది.

బ‌స్సులో ప్రయాణిస్తున్నప్పుడు పురిటినొప్పుల‌తో బాధ‌ప‌డుతున్న గ‌ర్బిణికి కాన్పు చేసి మాన‌వ‌త్వం చాటుకున్న గ‌ద్వాల డిపోన‌కు చెందిన కండ‌క్టర్ భార‌తి, డ్రైవ‌ర్ అంజిల‌తో పాటు న‌ర్సు అలివేలు మంగ‌మ్మను హైదరాబాద్ బస్ భవన్‌లో మంగ‌ళ‌వారం (ఆగస్టు 20వ తేదీన) టీజీఎస్ఆర్టీసీ యాజ‌మాన్యం అభినందించింది. సంస్థ ఉన్నతాధికారులతో కలిసి సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ వారిని ఘనంగా సన్మానించి.. న‌గ‌దు బ‌హుమ‌తులు అందించారు.  గద్వాల- వనపర్తి మార్గంలో నడిచే పల్లె వెలుగు బస్సులో రాఖీ నేపథ్యంలో.. సంధ్య అనే నిండు గర్భిణి వనపర్తి వెళ్తుంది.

Read more: Amrapali: కీలక పదవి కొట్టేసిన ఆమ్రాపాలీ.. మరోసారి తెలంగాణలో ఆరుగురు ఐఏఎస్ బదిలీలు..

ఆమె నాచహల్లి సమీపంలోకి రాగానే ఒక్కసారిగా పురిటినొప్పులు వచ్చాయి. వెంటనే మహిళా కండక్టర్‌ భారతి..అప్రమత్తమయ్యారు. అదే బస్సులో ఉన్న నర్సు అలివేలు మంగ‌మ్మ సాయంతో గర్భిణికి డెలీవరీ చేశారు. ఈ నేపథ్యంలో., సంధ్య.. పండంటి ఆడ‌బిడ్డకు సంధ్య జ‌న్మనిచ్చింది. అనంతరం 108 సాయంతో తల్లీబిడ్డను స్థానిక ఆస్పత్రికి తరలించారు. సమయస్పూర్తితో వ్యవహారించి.. సకాలంలో కాన్పు చేసిన కండ‌క్టర్ భార‌తి, న‌ర్సు అలివేలు మంగ‌మ్మ, డ్రైవ‌ర్ అంజి సేవలను ఈ సందర్భంగా టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ వారి సేవలను కొనియాడారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News