Bharat Bandh: దేశంలో వివిధ సమస్యలపై తీవ్ర ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. మణిపూర్ అల్లర్లతోపాటు పశ్చిమ బెంగాల్‌లో డాక్టర్ హత్యాచార సంఘటనతో దేశంలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యాపిస్తున్నాయి. ఇక రైతులు కూడా తమ డిమాండ్‌లపై మరోసారి తీవ్రస్థాయిలో ఉద్యమం నడిపేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే మరో ఉద్యమం రాజుకుంటోంది. ఎస్సీ వర్గీకరణ అంశంపై ఉద్యమిస్తామని ఓ సంఘం ప్రకటించింది. అందులో భాగంగా భారత్ బంద్‌కు ఆ సంఘం పిలుపునిచ్చింది.
Also Read: Phenyl Pour: విచిత్ర సంఘటన.. రేవంత్ రెడ్డి చిత్రపటానికి ఫినాయిల్‌తో అభిషేకం
21న భారత్ బంద్
ఎస్సీ,ఎస్టీ విభజన, క్రిమిలేయర్ మీద సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తున్నట్లు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి తెలిపింది. కుట్రపూరితంగా ఎస్సీ, ఎస్టీల్లో విబేధాలు సృష్టించడానికి వర్గీకరణను తీసుకొచ్చారని ఆ సమితి ఆరోపించింది. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా తాము పోరాటాలు చేస్తామని ప్రకటించింది. అందులో భాగంగా ఆగస్టు 21వ తేదీన దేశవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చినట్లు తెలిపింది.
Also Read: RK Roja Arrest: ఆడుదాం ఆంధ్రాలో అవినీతి.. ఆర్‌కే రోజా అరెస్ట్‌కు రంగం సిద్ధం?
ఈ మేరకు హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి సమావేశమైంది. ఆ సమితి కన్వీనర్ సర్వయ్య మాట్లాడుతూ.. ఎస్సీలు, ఎస్టీలను రాజ్యాధికారానికి దూరం చేయాలనే కుట్రతో కేంద్ర ప్రభుత్వం వర్గీకరణ కుట్ర చేసిందని మండిపడ్డారు. ఇది సుప్రీంకోర్టు తీర్పు కాదు అని ఇది బీజేపీ, నరేంద్ర మోదీ తీర్పు అని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ సోదరులు ఇప్పటికైనా మేల్కొని వర్గీకరణ వ్యతిరేక నినాదంతో పెద్ద ఎత్తున భారత్ బంద్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. భారత్ బంద్‌తో ఎస్సీ, ఎస్టీల ఐక్యతను కేంద్ర ప్రభుత్వానికి చూపించాలని సూచించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter
Bharat Bandh: ఈనెల 21న భారత్ బంద్.. స్కూల్స్, దుకాణాలు అన్నీ మూత?