8th Pay Commission Big Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్. ఉద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 8వ వేతన సంఘం గురించి అప్డేట్ ఇది. ఇది అమలైతే ఉద్యోగులకు జీతం, పెన్షనర్లకు పెన్షన్ భారీగా పెరగనున్నాయి. 8వ వేతన సంఘం అమల్లోకి వస్తే ఉద్యోగుల జీతం భారీగా పెరగనుంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు చాలాకాలంగా 8వ వేతన సంఘం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న 7వ వేతన సంఘం మరో రెండేళ్లలో ముగియనుంది. అందుకే ఇప్పట్నించే 8వ వేతన సంఘం అమలు కోసం ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.
ప్రస్తుతం అమల్లో ఉన్న 7వ వేతన సంఘం 2016 జనవరి 1న ప్రారంభమైంది. 2026 వరకు ఉంటుంది. 8వ వేతన సంఘం అమల్లోకి రావాలంటే రెండేళ్లు పడుతుంది. దాదాపు 1 కోటిమందికి ప్రయోజనం కలుగుతుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 8 వ వేతన సంఘం ఏర్పాటుకు ఆలోచిస్తోంది.
7వ వేతన సంఘం ప్రకారం 3.68 శాతం ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అమలు చేయాలనేది ఓ డిమాండ్. కానీ కేంద్ర ప్రభుత్వం 2.57 శాతం ఫిట్మెంట్ మాత్రమే ఇచ్చింది. అందుకే గత ఏడాది నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు 8వ వేతన సంఘం కోసం డిమాండ్ చేస్తున్నారు. బడ్జెట్లోగానీ తరువాత గానీ ఎలాంటి ప్రకటన రాలేదు. ఈసారి వస్తుందనే అంచనాలు ఉన్నాయి.
6వ వేతన సంఘం నుంచి 7వ వేతన సంఘానికి మారేటప్పుడు ఉద్యోగ సంఘాలు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ జీతం పెంపును 3.68 శాతానికి పెంచాలనే డిమాండ్ ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం 2.57 శాతమే పెంచింది. దాంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతం 7 వేల నుంచి 18 వేలకు పెరిగింది. పెన్షన్ 3500 నుంచి 9 వేలకు పెరిగింది.
ఇప్పుడు 8వ వేతన సంఘం అమలైతే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 1.92 శాతం కావచ్చు. దాంతో ఉద్యోగుల జీతం 18 వేల నుంచి 34,560 రూపాయలు కావచ్చు. ఇక పెన్షన్ అయితే ఏకంగా 17,2890 రూపాయలు ఉంటుంది.