అమరావతి: వైద్య ,ఆరోగ్య శాఖ అధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్ లో జరిపిన ఈ సమీక్షా సమావేంలో సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యంతో పాటు సహా వైద్య ఆరోగ్య శాఖ ఉన్నాతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైద్య రంగంలో అనుసరిస్తున్న సంస్కరణపై అధికారులతో సీఎం జగన్ చర్చించారు. ప్రభుత్వాసుపత్రుల్లో సౌకర్యాలు, మౌలిక సదుపాయాలుపై మంతనాలు జరిపారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సాయంపై జగన్ ఆరా తీశారు.
దాదాపు మూడు గంట పాటు జరిగిన ఈ సమీక్షసమావేశంలో వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రైవేటు రంగానికి దీటుగా ప్రభుత్వం ఆస్పత్రుల్లో వైద్యం అందిచేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భగా అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆరోగ్య పథకంలో చేపట్టాల్సిన మార్పులను అధికారులను జగన్ వివరించారు. పేదల ఆరోగ్యం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న ఎన్టీఆర్ వైద్య సేవ పథకాన్ని వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీగా మార్పు చేస్తున్నట్లు తెలుస్తోంది.