Sreeleela: శ్రీలీల ఆశలు గల్లంతేనా...ఆ సినిమాపై ఆశలు ఒదిలేసుకున్న భామ..

Sreeleela: శ్రీలీల.. ఈ మధ్యకాలలో ఈమెలా స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగిన భామ ఎవరు లేరనే చెప్పాలి.  అంతేకాదు తెలుగులో వరుస అవకాశాలతో తన సత్తా చూపెడుతోంది. తాజాగా ఈ భామ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఓ ప్రాజెక్ట్ ఉంటుందా లేదా అనేది డౌటే అని చెప్పాలి.

1 /6

శ్రీలీల.. ఈ యేడాది  త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్‌ బాబు కథానాయకుడిగా  తెరకెక్కిన 'గుంటూరు కారం' చిత్రంతో పలకరించింది. ఈ మూవీ సరైన విజయం సాధించపోయినా..ఈ సినిమాలో శ్రీలీల స్టెప్పకులకు ఆడియన్స్ మత్తెక్కిపోయారు.

2 /6

శ్రీలీల విషయానికొస్తే..  2001లో జూలై 14న అమెరికాలో జన్మించింది. వీళ్లది తెలుగు ఫ్యామిలీ కావడం విశేషం. ఒక తెలుగు భామ.. మన టాలీవుడ్ లో నెంబర్ కథానాయికగా సత్తా చూపెట్టడం అనేది ఈ మధ్యకాలంలో ఎవరు లేరనే చెప్పాలి. కానీ వరుస సినిమాలు ఫ్లాప్ అవుతూ ఉండటం వల్ల ఈమె కెరీర్ డైలామాలో పడిందనే చెప్పాలి.

3 /6

శ్రీలీల తల్లి విషయానికొస్తే.. ఈమె ప్రముఖ గైనకాలిజిస్ట్. విదేశాల్లో పుట్టిన శ్రీలీల బెంగళూరులో చదువు పూర్తి చేసుకుంది. పెళ్లిసందడి కంటే ముందు కిస్, భారతే వంటి కన్నడ సినిమాల్లో నటించింది.

4 /6

తెలుగులో శ్రీలీల..  దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన 'పెళ్లిసందD' మూవీతో పరిచయం అయింది. మొదటి సినిమాతోనే  తన యాక్టింగ్, డాన్సింగ్ స్కిల్స్‌తో ఇక్కడ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది.

5 /6

ఇక శ్రీలీల ఎన్నో ఆశలు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా పట్టాలెక్కుతుందా లేదా అనేది డౌటే అని చెబుతున్నారు. రీసెంట్ గా ‘మిస్టర్ బచ్చన్’ ప్రమోషన్ కార్యక్రమాల్లో హరీష్ శంకర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా ఉంటుందా లేదా అనేది తన చేతుల్లో లేదని చెప్పడంతో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడం డౌటే అని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

6 /6

ఒక రకంగా పవన్ కళ్యాణ్ తో స్క్రీన్ షేర్ చేసుకోవాలనుకున్న శ్రీలీల ఆశలు గల్లంతేనా అని ఆమె అభిమానులు చెప్పుకుంటున్నారు. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కినా.. అప్పటికీ ఈమె డేట్స్ అడ్జస్ట్ చేయగలుగుతుందా లేదా అనేది చూడాలి. ఏది ఏమైనా శ్రీలీల ఆశలు ఇప్పట్లో నెరవేరేలా కనపడటం లేదనే చెప్పాలి.