Visa Free Entry: ట్రావెలింగ్ ఇష్టపడేవారికి ప్రపంచమే సరిహద్దు. అందమైన ప్రాంతాలు, దేశాలు చాలానే ఉన్నాయి. దేశంలోనే కాదు విదేశాల్లో కూడా అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. అలాగని వీసా కోసం ఇబ్బందులు కూడా ఉండవు. ఎందుకంటే కొన్ని దేశాలు తిరిగేందుకు వీసా కూడా అవసరం లేదు. వీసా లేకుండానే ఈ దేశాలు చుట్టి రావచ్చు. ఈ అవకాశం భారతీయులకు అందిస్తున్నాయి ఈ దేశాలు.
భారతీయ పర్యాటకుల కోసం ఆరు దేశాలు వీసా ఫ్రీ ఎంట్రీ ప్రకటించాయి. దీని ప్రకారం ఈ ఆరు దేశాలకు వీసా లేకుండా వెళ్లవచ్చు. అయితే ఆ దేశానికి చేరుకున్న తరువాత వీసా ఆన్ ఎరైవల్ తీసుకోవాలి. వీసా ఆన్ ఎరైవల్ అంటే సంబంధిత దేశాలకు వెళ్లేటప్పుడు ముందుగా వీసా అవసరం లేదు. ఆ దేశంలో అడుగుపెట్టిన తరువాత అక్కడి ఎయిర్ పోర్ట్ లో మీ డాక్యుమెంట్స్ చెక్ చేసి వీసా జారీ చేస్తారు. డెడ్ సీ అంటే మృత సముద్రం తీరాన ఉన్న జోర్డాన్ దేశం ఈ ఆరు దేశాల్లో ఒకటి. చాలా అందమైన దేశం. లైమ్ స్టోన్, గ్రానైట్‌తో తయారైన వాది రమ్ వ్యాలీ చాలా ప్రసిద్ధి చెందింది. చారిత్రాత్మక పెట్రా నగరం కూడా పర్యాటకంగా ప్రాచుర్యం పొందింది. వీసా ఆన్ ఎరైవల్‌తో నెల రోజులు ఉండవచ్చు.
ఇక రెండవది మడగాస్కర్. అందమైన ప్రకృతి, వైల్డ్ లైఫ్‌కు ప్రసిద్ధి. ప్రకృతి ప్రేమికులకు సరైన ప్రాంతం. వీసా ఆన్ ఎరైవల్ సౌకర్యంతో నెలరోజులు తిరగవచ్చు. ఇక మూడవది ఆఫ్రికన్ దేశం మారిషేనియా. ప్రకృతి రమణీయత, సంస్కృతికి ప్రసిద్ధి. మంచి ఆహారం, పక్షుల కోసం చూస్తుంటే ఇదే సరైన దేశం. ఖర్చు కూడా చాలా తక్కువ. నాలుగో దేశం టాంజేనియా. సరెంగేటి నేషనల్ పార్క్, కిలిమంజారో పర్వతాలు, జంజీబార్ బీచ్‌లు చాలా ప్రసిద్ధి. వీసా ఆన్ ఎరైవల్‌తో గరిష్టంగా ఈ దేశంలో 90 రోజులు ఉండవచ్చు.
ఇక ఐదవది దక్షిణ అమెరికాలోని బొలీవియా దేశం. అందమైన సరస్సులు, పర్వతాలు, సముద్రాలు అన్నీ చూడవచ్చు. శాంటా క్రజ్, లా పాజ్, ఉయాని, కొచబాంబ వంటి హెరిటేజ్ నగరాలు మంచి అనుభూతిని కలిగిస్తాయి.ఈ దేశంలో వీసా ఆన్ ఎరైవల్ సౌకర్యంతో 3 రోజులు ఉండవచ్చు. ఇక ఆరవది కుక్ ఐస్‌ల్యాండ్. ఈ దేశం చిన్న చిన్న ద్వీపాల సమాహారం. పర్యావరణ ప్రేమికులకు మంచి ప్రాంతం. వీసా ఆన్ ఎరైవల్ సౌకర్యంతో 31 రోజులు ఉండవచ్చు.
Also read: Visa Free Policy: 20 దేశాలకు ఇండోనేషియా వీసా ఫ్రీ పాలసీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Visa Free Entry: భారతీయులకు గుడ్‌న్యూస్, ఆ 6 దేశాలకు వీసా అవసరం లేదు