KBC 16: మహాభారతానికి చెందిన ఈ ప్రశ్నకు జవాబు చెప్పలేక రూ.25 లక్షలు కోల్పోయాడు.. ఆ ప్రశ్న ఏంటో తెలిస్తే షాకవుతారు..

KBC 16 Episode: అమితాబ్‌ బచ్చాన్‌ 'కౌన్‌ బనేగా కరోడ్‌పతి' (KBC16) సీజన్‌ 16 ప్రముఖ టీవీ ఛానల్‌లో టెలిక్యాస్ట్‌ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రోగ్రామ్‌లో పార్టిసిపెంట్స్‌కు హోస్ట్‌ బిగ్‌బీ కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. దీనికి అన్నింటికి సరైన సమాధానాలు చెబితే కోటీ రూపాయాలు పొందే అద్భుత అవకాశం లభిస్తుంది.
 

1 /6

ఇటీవల అమితాబ్‌ బచ్చన్‌ ప్రతినిధ్యం వహిస్తున్న కౌన్‌ బనేగా కరోడ్‌పతిలో మన మహాభారతానికి సంబంధించిన ఓ ప్రశ్ననకు కంటెస్టెంట్‌ను అడిగాడు. దీనికి సరైన సమాధానం చెప్పలేని ఆయన ఏకంగా రూ.25 లక్షలు కోల్పోయాడు. ఇంతకి ఆ ప్రశ్నకు సమాధానం మీకు తెలుసా?  

2 /6

ఈ షో నిన్న సోమవారం అంటే 12వ తేదీ రాత్రి 9 గంటలకు ప్రసారమైంది. సోనీ ఎంటర్‌టైన్మెంట్‌ టెలివిజన్‌లో టెలిక్యాస్ట్‌ అయ్యే ఈ ప్రోగ్రామ్‌ ముఖ్యంగా నాలేడ్జీకి సంబంధింన ప్రశ్నలు అడుగుతారు. ఈ ప్రోగ్రామ్‌ 'జిందగీ హై హర్‌ మొద్‌ పర్‌ సవాల్‌ పూచేగీ జవాబ్ తో దేనాహోగా' అనే ట్యాగ్‌లైన్‌ కూడా ఉంది.

3 /6

అయితే, గుజరాత్‌కు చెందిన ఉత్కర్ష్‌ బక్షి నిన్న మొదట ఎపిసోడ్‌లో హాట్‌ సీట్‌లో వచ్చి కూర్చొన్నాడు. కానీ, మొదట్లో అతను భలే స్పీడ్‌గా ప్రతి ప్రశ్నకు జవాబులు ఇచ్చాడు.  అందులో ఒక లైఫ్‌లైన్‌ హెల్ప్‌ కూడా తీసుకున్నారు. అలా ఉత్కర్ష్‌ 13వ ప్రశ్నకు చేరుకున్నారు.  

4 /6

అవును 12 ప్రశ్నలకు టపటపామని జవాబు చెప్పిన ఉత్కర్ష్‌కు ఇక్కడే ఇబ్బంది మొదలైంది. అతని కారు స్పీడ్‌కు అసలైన బ్రేక్‌ పడింది. ఉత్కర్ష్‌ విఫలమైన ఆ రూ. 25 లక్షల సమాధానం ఏంటో తెలుసా?

5 /6

మహాభారతం ప్రకారం ఏ దేవుడు అంబకు హారాన్ని బహుమతిగా ఇచ్చాడు? దాన్ని ధరించినవారు భీష్ముని చంపగలరు? ఎ) శివుడు  బి) కార్తికేయుడు సి) ఇంద్రుడు డి) వాయుదేవుడు

6 /6

ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఏంటో తెలుసా? 12వ ప్రశ్న వరకు అలవోకగా జవాబులు చెప్పిన ఉత్కర్ష్‌ కూడా ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఎందుకు చెప్పలేకపోయాడో తెలుసా? దీనికి తప్పు సమాధానం చెప్పినందుకు ఆయన కేవలం రూ. 3,20.000 తో షో నుంచి వెనుదిరగాల్సి వచ్చింది.  దీనికి సరైన సమాధానం ఏంటో తెలుసా? మహాభారతంలో అంబకు ఆ హారం ఇచ్చింది కార్తికేయుడు.