New Railway Line Via Bhadradri: తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఇటీవల ప్రధాని మోదీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో రాష్ట్రానికి కూడా కొత్త రైల్వే మార్గానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో మొత్తం 8 రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది.
కేంద్రం తెలంగాణకు గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త రైల్వే నిర్మాణానికి సంబంధించిన సమావేశంలో తెలంగాణకు కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇది వయా భద్రాద్రి మీదుగా వెళ్తుంది. దీంతో ఇది తెలంగాణ వాసులకు గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఈ రైల్వే రూట్ ఒడిశా నుంచి భద్రాచలం వరకు వెళ్తుంది.
ప్రధాని మోదీ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. ఇందులో 8 కొత్త రైల్వే లైన్లకు శ్రీకారం చుట్టింది. అందులో ఈ భద్రాద్రి రైల్వే లైన్ ఒకటి. ఈ ప్రాజెక్టలకు దాదాపు రూ. 24,657 కోట్లు అవుతాయని అంచనా వేసింది.
ఈ ఎనిమిది రైల్వే మార్గాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, జార్ఖండ్, బీహర్, పశ్చిమ బెంగాల్ తెలంగాణ భద్రచలం వయా రైల్వే నిర్మాణ ప్రాజెక్టుకు రూ. 4,109 కోట్లు, ఇది దాదాపు 200 కిలో మీటర్ల పైనే ఉంటుందని అంచనా వేశారు.
తెలంగాణ భద్రాద్రి రైల్వే మార్గానికి మార్గం సుగమం అయింది. కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక్కడి భద్రాద్రి పుణ్య క్షేత్రానికి వెళ్లే భక్తులకు మార్గం సులభతరం అవుతుంది. అంతేకాదు విద్యుత్తు ప్లాంట్, బొగ్గు సరఫరా రవాణాకు కూడా మార్గం మరింత సులభతరం అవుతుంది.
తెలంగాణ భద్రాద్రి గుండా వెళ్లే రైల్వే మార్గం వల్ల ఖనిజ పరిశ్రమలకు కూడా ఎంతో ప్రయోజనం కలుగుతుంది. అంతేకాదు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్ కూడా విస్తరించవచ్చు.