YS Viveka Murder Case: తన తండ్రి హత్య జరిగిన ఐదేళ్లు దాటినా ఇంకా న్యాయం జరగకపోవడంతో ఆమె అలుపెరగని పోరాటం చేస్తోంది. తన తండ్రిని హత్య చేసిన హంతకులకు శిక్షపడేలా న్యాయస్థానంలో పోరాటం చేస్తూనే రాజకీయంగానూ పోరాటం చేస్తున్నారు. ఆమెనే వైఎస్ వివేకానందా రెడ్డి కుమార్తె నర్రా సునీతా రెడ్డి. తన తండ్రి హత్యపై సునీత మరో ముందడుగు వేశారు. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వ సహాయం కోరారు. ఈ సందర్భంగా ఏపీ హోం మంత్రిని కలిసి తన తండ్రి హత్యపై విచారణ త్వరితం చేయాలని విజ్ఞప్తి చేశారు. దీంతో ఈ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
Also Read: Nara Lokesh: క్షమాపణలు చెప్పిన ఏపీ మంత్రి నారా లోకేశ్.. ఎందుకు ఏం తప్పు చేశారంటే?
అమరావతిలోని సచివాలయంలోని రెండో బ్లాక్‌లో హోం మంత్రి వంగలపూడి అనిత ఛాంబర్‌లో బుధవారం వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు సునీత కలిశారు. తన తండ్రి హత్య కేసు విషయమై హోంమంత్రి అనితతో మాట్లాడారు. తన తండ్రి హత్య కేసులో జరిగిన అన్యాయాన్ని మంత్రికి ఆమె వివరించారు. వివేకా హత్య అనంతరం హత్య వెనక జరిగిన పరిణామాలన్నీ పూసగుచ్చినట్లు మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. గత ప్రభుత్వంలో ఈ కేసుపై ఎలాంటి నిర్ణయాలు తీసుకుందో గుర్తు చేశారు.
Also Read: YSRCP MPs Resign: వైఎస్ జగన్‌కు భారీ షాక్.. త్వరలో ఆరుగురు ఎంపీల రాజీనామా?
వైఎస్ వివేకాను హత్య చేసిన నిందితులకు గత ప్రభుత్వం అండగా నిలిచిందని హోంమంత్రికి సునీత తెలిపారు. గత ప్రభుత్వంలో పోలీసులు కూడా కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తూ నిందితులకు అండగా నిలిచారని వివరించినట్లు సునీత తెలిపారు. వైఎస్ వివేకా హత్య కేసుపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. విచారణ సమయంలో కేసును నీరుగార్చేలా వ్యవహరించారని.. అన్నిటిపై చర్యలు తీసుకోవాలని కోరారు. సీబీఐ అధికారులపై తప్పుడు కేసుతో పాటు సాక్షులను బెదిరించారని హోంమంత్రికి వివరించారు. తన తండ్రి కేసులో న్యాయం కావాలని సునీత కోరారు.
హోంమంత్రి భరోసా
వైఎస్ వివేకా హత్యపై సునీత చెప్పిన విషయాలను విన్న అనంతరం హోంమంత్రి అనిత సానుకూలంగా స్పందించారు. కేసు సీబీఐ విచారణలో ఉండడంతో ఆ కేసు విచారణకు ప్రభుత్వం పూర్తి సహకరిస్తుందని హోంమంత్రి హామీ ఇచ్చారు. దోషులకు శిక్ష పడేలా చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని.. తప్పు చేసిన పోలీసులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని సునీతకు మంత్రి భరోసా ఇచ్చారు. కాగా తండ్రి హత్యపై సునీత రాజకీయంగా.. న్యాయపరంగా పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే.
ఐదేళ్లుగా పోరాటం
వైఎస్ వివేకా 15 మార్చి 2019లో హత్యకు గురవగా ఇంకా విచారణ కొనసాగుతోంది. ఈ హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ప్రధాన హస్తం ఉందని మొదటి నుంచి సునీత ఆరోపిస్తున్నారు. అతడిని అరెస్ట్ చేయాలని బహిరంగంగా డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. హైకోర్టు, సుప్రీంకోర్టులో కేసు వేయగా.. ప్రస్తుతం వైఎస్ వివేకా హత్య కేసు సీబీఐ పరిధిలో ఉంది. ఆ కేసు విచారణ కొనసాగుతోంది. ఈ కేసు విషయమై తన సోదరుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై బహిరంగ యుద్ధం ప్రకటించారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే అతడికి వ్యతిరేకంగా ఉద్యమం చేశారు.
రాజకీయంగానూ...
ఇక తన సోదరి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆ పార్టీలో సునీత తిరిగారు. ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన అవినాశ్‌కు వ్యతిరేకంగా ఎన్నికల ప్రచారంలో సునీత ప్రచారం చేసిన విషయం తెలిసిందే. ఊరూరా తిరిగి తన తండ్రి హత్య విషయాన్ని ప్రజలకు వివరించారు. తనకు న్యాయం చేయాలని ఒక ఆడబిడ్డగా.. మహిళగా కొంగు చాటు అడుగుతున్నట్లు చెప్పడం అందరినీ ఆలోచింపజేసింది. ఇప్పుడు ఏపీలో కూటమి ప్రభుత్వం రావడంతో వైఎస్ వివేకా హత్య కేసులో పురోగతి వచ్చే అవకాశం ఉంది. ఇదే విషయమై సునీత హోంమంత్రిని కలిశారు. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter