Murari Re Release: రీ రిలీజ్ లో మహేష్ బాబు మురారి మూవీ దూకుడు.. సూపర్ స్టార్ మాస్ రచ్చకు బాక్సాఫీస్ షేక్ ..

Murari Re Release: గత కొన్నేళ్లుగా తెలుగులో పాత సూపర్ హిట్ సినిమాలను రీ రిలీజ్ చేయడం ఎక్కువై పోయింది. మొదట్లో రీ రిలీజ్ లను ప్రేక్షకులు ఆదిరించారు. కానీ రాను రాను మాత్రం తెలుగులో ఈ రీ రిలీజ్ లపై ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గించింది. కానీ మహేష్ బాబు నటించిన ‘మురారి’ మూవీ రీ రిలీజ్ లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది.

1 /7

Murari Re Release: పాత బ్లాక్ బస్టర్స్ క్లాసిక్స్ మూవీలను  రీ రిలీజ్ చేయడం గత రెండేళ్లుగా ఎక్కువైపోయింది. ఇప్పటి వరకు ఎన్టీఆర్ నటించిన ‘సింహాద్రి’ ఎక్కువ రీ రిలీజ్ లో ఎక్కువ వసూళ్లను సాధించిన సినిమాగా రికార్డులను క్రియేట్ చేసింది. తాజాగా ఈ రికార్డుకు బ్రేక్ చేస్తూ మహేష్ బాబు నటించిన ‘మురారి’ రీ రిలీజ్ లో బ్రేక్ చేసిందనే చెప్పాలి.

2 /7

మహేష్ బాబు హీరోగా నటించిన 4వ చిత్రం. కృష్ణవంశీ దర్శకత్వంలో కృష్ణతో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన ఎన్.రామలింగేశ్వరావు నిర్మించారు. ఆయనతో పాటు ఎన్. దేవీ ప్రసాద్, గోపీ నందిగం ఈ సినిమాను భారీ ఎత్తున నిర్మించారు. ఈ సినిమా 2001 ఫిబ్రవరి 17న శివరాత్రి కానుకగా విడుదలై సంచలన విజయం సాధించింది.

3 /7

ఒక కుటుంబానికి సంబంధించిన శాపం నేపథ్యంలో కృష్ణవంశీ ఈ సినిమాను ఎంతో రీసెర్చి చేసి ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన సోనాలి బింద్రే కథానాయికగా నటించింది.  అంతేకాదు ఈ సినిమా మహేష్ బాబు తొలి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాకు మణిశర్మ అందించిన బాణీలు మ్యూజికల్ హిట్ గా నిలిచింది.  

4 /7

మరోవైపు హైదరాబాద్ సుదర్శన్ 35 ఎంఎంలో ‘మురారి’ సినిమా 175 రోజులకు పైగా నడిచింది. మహేష్ బాబు కెరీర్ లో తొలి సిల్వర్ జూబ్లీ మూవీగా రికార్డులు క్రియేట్ చేసింది. ఆ తర్వాత సుదర్శన్ 35 ఎంఎంలో ‘అతడు’, పోకిరి’ సినిమాలు కూడా సిల్వర్ జూబ్లీ పూర్తి చేసుకోవడం విశేషం.

5 /7

తాజాగా ‘మురారి’ సినిమాను మహేష్ బాబు బర్త్ డే అయిన ఆగష్టు 9న ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. అయితే. .ఈ సినిమాకు సంబంధించిన టికెట్స్ ను బుక్ మై షోలో ఉంచగా.. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా దాదాపు కోటి రూపాయిలకు పైగా గ్రాస్ వసూళ్లను  సాధించినట్టు టర్ేడ్ వర్గాలు చెబుతున్నాయి.

6 /7

హైదరాబాద్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ఇప్పటికే రూ. 2 కోట్ల గ్రాస్ వసూళ్లను క్రాస్ చేసి సంచలనం రేపుతోంది. ఇప్పటికే బుక్ మై షోలో 40 వేలకు పైగా టికెట్ సేల్స్ తో రీసెంట్ టైమ్ లో ఏ సినిమాకు లేని హైప్ ‘మురారి’ మూవీకి క్రియేట్ అయిందనే చెప్పాలి.

7 /7

ఓవరాల్ గా రిలీజ్ కు రెండు రోజులు ముందు ఈ సినిమా రూ. 3 కోట్లకు పైగా గ్రాస్ వసూల్లతో మహేష్ బాబు ‘మురారి’ మూవీ రీసెంట్ టైమ్ రీ రిలీజ్ మూవీస్ లో  సరికొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేయడం విశేషం.