Tollywood Best Friends: పవన్, త్రివిక్రమ్ సహా తెలుగు ఇండస్ట్రీలో ప్రాణ స్నేహితులు వీళ్లే.. పార్ట్ -1


Tollywood Best Friends: జీవితంలో అన్నిటి కంటే విలువైనది స్నేహం. అది దొరకడం అంత ఈజీ కాదు. మన కోసం ఏ సంబంధం లేకుండా ముందడుగు వేసేది స్నేహితులు మాత్రమే. కష్టాల్లో తోడు నీడా.. అవసరం అయినపుడు అండగా నిలబడేవాడే నిజమైన స్నేహితుడు. అలా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రాణ స్నేహితులు కొందరున్నారు.

1 /9

త్రివిక్రమ్ - పవన్ కళ్యాణ్ తెలుగు సినీ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ తొలిసారి ‘జల్సా’ మూవీతో తొలిసారి కలిసి పనిచేసారు. వీళ్లిద్దరి మనస్తత్వాలు కలవడంతో  అది స్నేహంగా బలపడింది. 

2 /9

మోహన్ బాబు - రజినీకాంత్ సూపర్ స్టార్ రజినీకాంత్, తెలుగు స్టార్ హీరో మోహన్ బాబు మంచి స్నేహితులు. తొలిసారి వీళ్లిద్దరు కలిసి నటించినపుడు మొదలైన స్నేహం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.

3 /9

బాలకృష్ణ - కిరణ్ కుమార్ రెడ్డి: నందమూరి నట సింహం, ఉమ్మడి ఏపీ చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మధ్య కాలేజీ రోజుల నుంచి మంచి స్నేహమే ఉంది.

4 /9

చిరంజీవి - నాగార్జున: చిరంజీవి, నాగార్జున మధ్య ఎంతో మంచి అనబంధం ఉంది. అది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.

5 /9

మహేష్ బాబు - సుమంత్: తెలుగు సినీ ఇండస్ట్రీలో మహేష్ బాబు, సుమంత్ మధ్య స్కూల్ డేస్ నుంచి మంచి స్నేహం ఉంది. ఇప్పటికీ అది పదిలంగా ఉంది.  

6 /9

రవితేజ - పూరీ జగన్నాథ్: రవితేజ, పూరీ జగన్నాథ్ ఇద్దరు సినీ ఇండస్ట్రీలో స్ట్రగుల్ అయ్యేటప్పటి నుంచి మంచి స్నేహుతులు. ఆ తర్వాత వీళ్లిద్దరు కలిసి పలు బ్లాక్ బస్టర్ చిత్రాలు వచ్చాయి.  

7 /9

త్రివిక్రమ్ - సునీల్: సినీ ఇండస్ట్రీలోకి రాకముందు నుంచే త్రివిక్రమ్, సునీల్ మధ్య మంచి అనుబంధమే ఉంది.

8 /9

ప్రభాస్ - గోపిచంద్: వర్షం సినిమా నుంచి ప్రభాస్, గోపీచంద్ ల మధ్య స్నేహం మొదలైంది. అప్పటి నుంచి వీళ్లిద్దరి మధ్య మంచి అనుబంధమే ఏర్పడింది.

9 /9

ప్రభాస్ - అల్లు అర్జున్: ప్రభాస్ , అల్లు అర్జున్ మధ్య కూడా మంచి స్నేహ బంధమే ఉంది. బయట కనపడకపోయినా.. వీళ్లిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది.