JIo Super Plan: జియో సూపర్‌ రీఛార్జ్‌ ప్లాన్‌.. అతితక్కువ ధరలో ఫ్రీ కాలింగ్‌, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌‌..

JIo Super Recarge Plan:రిలయన్స్‌ జియో తమ వినియోగదారులకు బంపర్‌ ఆఫర్. అతి తక్కువ ధరకే సూపర్‌ రీఛార్జీ ప్లాన్‌ అందుబాటులో ఉంది. ఇందులో ఫ్రీ కాలింగ్‌తోపాటు ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ అదనంగా పొందే అవకాశం..
 

1 /5

దిగ్గజ రిలయన్స జియో దేశవ్యాప్తంగా ఉన్న తమ నెట్వర్క్‌ను విస్తరించడానికి మరో ముందడుగు వేసింది. అందుకే జియో వినియోగదారుల కోసం అతి తక్కువ ధరకే రీఛార్జ్‌ ప్లాన్‌ను తీసుకువచ్చింది. ఇందలో మీకు నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌, ఇతర ఓటీటీ సబ్‌స్క్రిప్షన్స్‌ కూడా పొందవచ్చు.   

2 /5

రిలయన్స్‌ జియో ప్రిపెయిడ్‌ ప్లాన్‌ రూ.329 ప్లాన్‌తో ప్రతిరోజూ 1.5 జీబీ డేటా పొందవచ్చు. ఈ ప్లాన్‌లో 100 ఎస్‌ఎంఎస్‌లు, అపరిమిత కాలింగ్‌ పొందుతారు. అంతేకాదు ఈ జియో ప్లాన్‌ ద్వారా జియోసావన్‌ ప్రో 28 వ్యాలిడిటీ లభిస్తుంది.  

3 /5

జియో రూ. 949 ప్లాన్‌తో ప్రతిరోజూ 100 ఎస్‌ఎంఎస్‌లు, 2 జీబీ డేటా, అపరిమిత వాయిస్‌ కాలింగ్‌, 84 రోజులకు వ్యాలిడిటీ వస్తుంది. ఈ ప్లాన్‌ తో డిస్నీ హాట్‌స్టార్‌ 90 రోజులపాటు ఫ్రీగా సబ్‌స్క్రిప్షన్‌ పొందవచ్చు.  

4 /5

జియో రూ.1049 ప్రిపెయిడ్‌ ప్లాన్‌ ద్వారా ప్రతిరోజూ 2 జీబీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లు, అపరిమిత వాయిస్‌ కాలింగ్‌, 84 రోజులపాటు వర్తిస్తుంది. ఇందులో మీకు సోనిలైవ్‌, జీ5 సబ్‌స్క్రిప్షన్స్‌ అదనంగా పొందుతరు. అంతేకాదు ఇందులో జియోటీవీ, జియోక్లౌడ్‌, జియో సినిమా ఆప్షన్స్‌ కూడా ఉంటాయి.  

5 /5

ఈ ప్లాన్‌తోపాటు రిలయన్స్‌ జియో భారత్‌ J1 4G ఫీచర్‌ ఫోన్‌ కూడా ప్రారంభించింది. ఇది 2.8 ఇంచుల డిస్ప్లే, 2,500 mAh బ్యాటరీ ఉన్నాయి. ఈ ఫోన్‌లో జియోచాట్‌, జియోటీవీ, జియోసావన్‌, జియోపే, జియో ఫోటోస్‌ కూడా అందుబాటులో ఉన్నాయి.